మరో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించనున్నఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ తేదిని మే 10న నిర్ణయించిన ఈసీఐ 13న ఫలితాలు తేల్చనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి కర్ణాటక వైపు మళ్లనుండి జాతీయ పార్టీలన్ని కూడా ఈ సారి తమ పట్టు నిరూపించుకోవాలన్న సంకల్సంతో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారం చేజిక్కుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తహతహాలాడుతోంది. ఈ ఎన్నికల్లో కొత్తగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందో తేలాల్సి ఉంది.