స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీ

రంగంలోకి దిగనున్న ఈసీఐ

రేపు ప్రత్యేకాధికారి రాక

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కీలక మలుపు తిరిగింది. హై కోర్టు ఆదేశాలతో భారత ఎన్నికల సంఘం నుండి ప్రత్యేక అధికారి జగిత్యాలకు రానున్నారు. సోమవారం స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై సమగ్ర విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు.

అసలేం జరిగింది..?

2018లో జరిగిన ధర్మపురి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టను ఆశ్రయించారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూంలో ఉంచిన పోలింగ్, కౌంటింగ్ ఫామ్స్ కు సంబంధించిన వివరాలను కోర్టులో సమర్పించాలని హై కోర్టు ఎన్నికల అధికారి బిక్షపతిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో హై కోర్టు ఆదేశాలు అందించారు. ఈ నెల 10న జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా సమక్షంలో ధర్మపురి కౌంటింగ్ స్ట్రాంగ్ రూం ఓపెన్ చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఇందులో రెండు తాళం చేతులు పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించగా, కలెక్టర్ యాస్మిన్ భాషా మాత్రం తాళలు ఓపెన్ కావడం లేదని చెప్పుకొచ్చారు. అయితే లక్ష్మణ్ కుమార్ మాత్రం తాళం చేతులు లేనందును ప్రత్యామ్నాయంగా తాళాలను పగలగొట్టేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో మద్యాహ్నం వరకూ ప్రయత్నాలు చేసిన జిల్లా యంత్రాంగం నూకపల్లి కాలేజీలోని స్ట్రాంగ్ నుండి వెనుదిరిగారు. తాళాలు ఓపెన్ కావడం లేదన్న విషయం హై కోర్టు దృష్టికి తీసుకెల్తామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష మీడియాకు వివరించారు. అయితే తాళాలు ఓపెన్ కాకపోవడం కాదని, తాళం చేతులే మిస్సయ్యాయని స్ట్రాంగ్ రూంకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పిటిషన్ ను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని భారత ఎన్నికల సంఘాన్ని ఈ నెల 12 ఆదేశించింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఏప్రిల్ 26న తన ముందు ఉంచాలని స్పష్టం చేసింది.

సోమవారం విచారణ

హై కోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఐఏఎస్ అధికారి సోమవారం జగిత్యాలకు రానున్నారు. కొండగట్టు జెఎన్ టీయూలో సమగ్ర విచారణ జరపనున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి భిక్షపతితో పాటు ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికి సమాచారం ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్యాలయం నుండి కూడా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణ అధికారి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి 2018 నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. ఈ మేరకు నివేదిక తయారు చేసిన తరువాత ఈసీఐ ద్వారా హై కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page