కరీంనగర్ లో ఈడీ, ఐటీ దాడుల వెనక..?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈడీ, ఐటీ దాడుల వెనక ఏం జరుగుతోంది..? క్యాబినెట్ మంత్రి ఇంట్లో సోదాలు జరపడం వెనక ఆంతర్యం ఏంటీ..? తెలంగాణాలో ఈడీ, ఐటీ దాడులు సర్వసాధరణంగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో కరీంనగర్ లో జరిగిన దాడులపై ఓ లుక్కెద్దాం…

రెండు రోజులుగా కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులపై జరుగుతున్న దాడులు కలకలం లేపాయి. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సోదరులకు సంబందించిన గ్రానైట్ కార్యాలయంతో పాటు ఇండ్లలో సోదాలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి), ఇన్ కం ట్యాక్స్ (ఐటి) అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టడం కలకలం సృష్టించింది. 2013 వరకు జరిగి గ్రానైట్ బ్లాకుల ఎగుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదిక ఆదారంగా గత రెండు మూడు సంవత్సరాలుగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. 2021లో కరీంనగర్ కు చెందిన 9 గ్రానైట్ ట్రాన్స్ పోర్టు ఏజెన్సీల ద్వారా ఎంత పరిమాణంలో బ్లాకులను తరలించారు..? కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా తరలించిన వివరాలను ఇవ్వాలని ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైకి ఈడి డిప్యూటీ డైరక్టర్ రాహుల్ సింఘానియా లేఖ రాశారు. ఇందులో కరీంనగర్ కు చెందిన శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బాక్సీ అండ్ కో, మైథిలీ ఆదిత్య ట్రాన్స్ పోర్ట్, కెవికె ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్ఆర్ గ్రానైట్స్, శ్రీవెంకటేశ్వర / వెంకటేశ్వర లాజిస్టిక్స్ ఏజెన్సీల ద్వారా రవాణా చేసి తరలించిన గ్రానైట్ బ్లాకుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఫెమా యాక్టు 2002, ఫారిన్ ఎక్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్టు 1999 ప్రకారం వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో కరీంనగర్ గ్రానైట్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఈడీ రంగంలోకి దిగుతుందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేఫథ్యంలో ఆయా ట్రాన్ప్ పోర్ట్ ఏజెన్సీల వివరాలను సేకరించిన ఈడీ అధికారులు వాటి బ్యాకు లావాదేవీలను కూడా సేకరించినట్టు సమాచారం. నేడో రేపో ఈడీ, ఐటీ రంగంలోకి దిగుతుందని ఏడాది క్రితం ప్రచారం జరిగినప్పటికీ ఇన్నాళ్లూ స్తబ్దత నెలకొంది. అయితే అనూహ్యంగా బుధ వారం ఈడీ, ఐటీ అధికారులు ఎంట్రీ ఇచ్చేసి సంచలనం కల్గించారు. ఈ దాడుల్లో పాల్గొన్న అధికారుల్లో ఎక్కువగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఐఆరెఎస్, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్న ఈ టీమ్స్ మానిటరింగ్ అంతా కూడా ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీ నుండే మానిటరింగ్ నడుస్తున్నట్టు సమాచారం. ఎక్కువగా

అసలేం జరిగింది..?

2013లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారం రూ. 124 కోట్ల సీనరేజ్ ఎగవేశారని ఇందుకు ఆయా ఏజెన్సీలపై ఐదు రెట్లు అంటే సుమారు రూ. 750 కోట్ల పెనాల్టి విధించాలని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకూడదని తమకు విధించిన పెనాల్టీలో మినహాయింపు ఇవ్వాలని సంస్థలు అప్పుడు ప్రభుత్వాన్ని కోరగా వన్ ప్లస్ 5 ఉన్న జరిమానాను వన్ ప్లస్ వన్ కు తగ్గిస్తూ మెమో విడుదల చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిభందనలకు విరుద్దమని మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కరీంనగర్ గ్రానైట్ ఏజెన్సీల ద్వారా రవాణా అయిన గ్రానైట్ బ్లాకుల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై పలువురు జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్టీపీ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి భాస్క్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్ జీ, కరీంనగర్ కు చెందిన న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావులు వేర్వేరుగా దర్యాప్తు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి, పీఎంఓకు, మంత్రులకు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ, ఐటీలో సంయుక్తంగా దర్యాప్తు చేయడం ఆరంభించాయి.

You cannot copy content of this page