కవిత కేసులో ట్విస్ట్
దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో శనివారం ఉదయం నుండి ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. అయితే ఈడీ అధికారుల విచారణలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ఇవ్వాలని అధికారులు కోరాగా ఇంటి వద్ద పెట్టి వచ్చానని కవిత బదులిచ్చారు. దీంతో తన సిబ్బందిని పంపించి ఫోన్ తెప్పించిన కవిత ఈడీ అధికారులకు అప్పగించారు. తరుచూ మొబైల్ ఫోన్లు మార్చడం గురించి కవితను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 2021-22లో లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో 10 ఫోన్లను కవిత మార్చిందని ఈడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. సమీర్ మహేంద్రు చార్జ్ షీట్ లోను కవిత ఫోన్లను మార్చినట్లు ఈడీ పేర్కొంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు వాట్సప్ ఛాటింగ్ గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. పిళ్లై నుండి రాబట్టిన విషయాలపై కూడా ఆరా తీసే పనిలో నిమగ్నం అయినట్టుగా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే కవితను ఈ రోజు వదిలేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పెద్ద సంఖ్యలో ఢిల్లీలోనే మకాం వేశారు. మరో వైపున రాష్ట్రంలోని ముఖ్య నాయకులను సైతం ఢిల్లీకి వెల్లాలని అధినేత ఆదేశించారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
Disha Dasha
1884 posts
Prev Post