24 గంటలు గడవక ముందే… ED ఎంట్రీ

రాష్ట్రంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నోటీసుల కలకలం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రముఖ నటి రకుల్ ప్రీతి సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మరో కొత్త కేసు తెరపైకి వచ్చినట్టైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేసుల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థలు వివిధ కేసులతో సంబంధం ఉన్నాయంటూ రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు నోటీసులు ఇస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో నోటీసుల పరంపర కొనసాగిస్తున్న ఈడీ తాజాగా బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబందించిన నోటీసులు జారీ చేసింది.

పైలెట్… రోహిత్…

బెంగుళూరు డ్రగ్స్ కేసు విషయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఈడి. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. అయితే రోహిత్ రెడ్డి సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. తనను కేవలం ఆధార్ కార్డు, ఓటరు కార్డు తీసుకుని రావాలని చెప్పారని అయితే ఆ నోటీసులో ఏ కేసు గురించో వివరించలేదని రోహిత్ రెడ్డి అంటున్నారు. నోటీసులు అందుకున్న తరువాత న్యాయవాదులతో చర్చలు జరిపిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాను లీగల్ ఓపినీయన్ తీసుకున్న తరువాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటానని చెప్తున్నారు. అయితే సడెన్ గా ఈడీ అధికారుల నోటీసులపై రోహిత్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈడీ అధికారులు కూడా కేసు వివరాలను పొందు పర్చకుండా నోటీసులు ఎలా జారీ చేశారు..? ఇలా నోటీసులు ఇచ్చే అధికారం వారికి ఉంటుందా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. సోమవారం వరకు టైం ఉండడంతో రోహిత్ రెడ్డికి నోటిసులు ఇచ్చిన వ్యవహారం ఎటు దారి మల్లుతుందోనని అనుకుంటున్నారు.

రకుల్ కు…

మరో వైపున ప్రముఖ సినీ హిరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. బెంగుళూరు డ్రగ్స్ కేసు విషయంలో విచారించేందుకు ఈ నెల 19న హాజరు కావాలని ఈడీ ఆ నోటీసుల్లో కోరింది. అయితే రకుల్ కు డ్రగ్స్ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆమెకు ఎవరెవరితో టచ్ లో ఉండేది, ఆర్థిక లావాదేవీలు తదితర పూర్తి అంశాలపై ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. బెంగుళూరులో నమోదయిన ఈ కేసు ఛార్జిషీట్ వేయకుండానే మూసి వేయడంపై బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది.

24 గంటల్లోనే…

డ్రగ్స్ కేసు రీ ఓపెన్ అవుతుందని, అందులో ప్రమేయం ఉన్న వారందిరికి నోటీసులు అందుతాయని గత ఐదు రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేస్తున్నారు. ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే బండి సంజయ్ పాదయాత్ర గురువారం కరీంనగర్ లో ముగిసిన సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర పూర్తి అయి 24 గంటలు తిరగక ముందే ఈడీ బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబందించిన వ్యవహారంలో నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

You cannot copy content of this page