పిళ్లైని కోర్టుకు తరలిస్తున్న ఈడీ

లిక్కర్ స్కాంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు స్పెషల్ కోర్టుకు తీసుకెల్తున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు కవిత, పిళ్లైలను ముఖాముఖిగా ఈడీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనకు కోర్టు ఇచ్చిన కస్టడి టైం ముగియడంతో ఈడీ అధికారులు ఈడీ స్పెషల్ కోర్టులో ప్రవేశ పెట్టేందుకు వాహనంలో తీసుకెళ్తున్నారు. అయితే మూడు గంటల పాటు కవిత, పిళ్లైలను సంయుక్తంగా విచారించిన అధికారులు ఇక కవితను సింగిల్ గా విచారించనున్నారు. ఈడీ అధికారుల వద్ద ఉన్న ఎవిడెన్స్ ల ఆదారంగా కవితను సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే పిళ్లై జ్యుడిషియల్ కస్టడీ పొడగించాలని ఈడీ కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే సెకండ్ సెషన్ లో కవితను, బుచ్చిబాబు, మనిష్ సిసోడియా, విజయ్ నాయర్ లను కూడా ముఖాముఖిగా విచారించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page