రేపు విచారణకు రావాలన్న ఈడీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళ ఎమ్మెల్సీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించిన వ్యవహారంలో విచారణకు రావాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. మనీ లాండరింగ్ కేసులో కవితకి నోటీసులు ఇచ్చిన ఈడీ గురువారం ఈడీ కార్యాలయంలో విచారణకకు హాజరుకావాలని పేర్కొంది. లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లై అరెస్ట్ తో కవిత పాత్ర పై మరింత సమాచారం రాబట్టాలని ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. గతంలో ఈడీ చార్జిషీట్ లో పిళ్ళై పై ఈడీ కీలక అభియోగాలు చేసింది. కవిత తరుపున అరుణ్ పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని ఆరోపించిన ఈడీ, అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని సమీర్ మహేంద్రుతో కవిత అన్నారని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. దక్షిణాది వ్యాపారులకు ఢిల్లీలో రిటైల్ జోన్స్ ఇచ్చినందుకు గాను ఆప్ కి వందకోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందన్న ఆరోణలు చేస్తోంది. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జీషీట్లో 28సార్లు కవిత పేరు ప్రస్తావించిన ఈడీ, ఢిల్లీలో సౌత్ గ్రూప్ ప్రతినిధులుగా పనిచేసిన అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చి బాబుల సూచనలతో ఇండో స్పిరిట్స్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు కోటి రూపాయలు, ఇండియా ఎ హెడ్ సంస్థకు రూ. 70 లక్షల బదిలీ చేశారని పేర్కొంది. ఇండో స్పిరిట్ వ్యవహారంలో కవిత ప్రయోజనాలకు అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులు ప్రాతినిథ్యం వహించారని వివరించింది. ఇండో స్పీరిట్స్ లో కవిత, శరత్ రెడ్డి, మాగుంట తరపున తాను పెట్టుబడి పెడుతున్నట్లు సమీర్ మహేంద్రుకు చెప్పిన అరుణ్ పిళ్లై ఇందుకు కవిత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారి ఈడీ ఆరోపిస్తోంది. ఆమె తరుపున తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానని సమీర్‌కు వెల్లడించిన అరుణ్ పిళ్లై 2021 ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో జరిగిన విందులో చర్చించుకున్నారని వివరించింది. అరుణ్ పిళ్లై ద్వారా, ఫేస్ టైం యాప్ లో సమీర్ మహేంద్రులు మాట్లాడుకున్నారని, కవిత ఇండో స్పిరిట్ ఎల్1 దరఖాస్తు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరుణ్ పిళ్లై ద్వారా కవితతో సమీర్ మహేంద్రు మాట్లారని వివరించింది. అరుణ్ తన కుటుంబ సభ్యుడు లాంటి వారని, అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత చెప్పారని, ఇదే పద్దతిన రానున్న కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని కూడా కవిత చెప్పారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కవితను విచారించేందుకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది.
విచారణకు వెల్తారా..?
అయితే కవిత ఈడీ విచారణకు వెల్తారా వాయిదా కోరతారా అన్న చర్చ సాగుతోంది. 10న మహిళా రిజర్వేషన్ పై జరగనున్న ఆందోళనకు కవిత హాజరు కావల్సి ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు వెల్లేందుకు సుముఖత తెలుపుతారా లేదా అన్న తర్జన భర్జన సాగుతున్నాయి. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
అరెస్ట్ కు స్కెచా..?
అయితే నోటీసులు ఇచ్చిన తరువాత విచారణకు వెల్లిన వారిలో చాలా మందిని అరెస్ట్ చేసే ఆనవాయితీ కొనసాగిస్తున్న నేపథ్యంలో కవిత ఎలంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నదే హాట్ టాపిక్ గా మారింది. రెండో సారి నోటీసులు ఇచ్చిన తరువాత ఇటీవల మనీష్ కుమార్ సిసోడియాను అరెస్ట్ చేసినట్టుగానే కవితను అరెస్ట్ చేస్తే ఎలా అన్న విషయంపై బీఆర్ఎస్ వర్గాలు ఆలోచిస్తున్నాయి.