నాగారం భూముల విషయంలో మాజీ ఆర్డీఓకు ఈడీ నోటీసులు

దిశ దశ, హైదరాబాద్:

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నాగారం భూముల విషయంలో విచారణ కొనసాగిస్తూనే ఉంది. మహేశ్వరం సమీపంలోని నాగారంలో అత్యంత విలువైన భూములను కెటాయించిన విషయంలో విచారణ చేపట్టిన ఈడీ వివిధ కోణాల్లో ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్, తహసీల్దార్ జ్యోతిలను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న సంగతి తెలిసింది. వారి స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 

You cannot copy content of this page