కవితకు ఈడీ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరైన కవితను దాదాపు 10.30 గంటల పాటు ఈడీ అధికారుల బృందం విచారించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం కూడా మళ్లీ విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ రోజు ఢిల్లీలోనే కవిత ఉండాల్సిన పరిస్థితి ఏర్పడగా… ఆమె రేపటి విచారణపై ఎలా స్పందిస్తారోనన్నదే తేలాల్సి ఉంది. తనకు కుదరదని చెప్తారా లేక సోమవారం లాగే ఈడీ ఎంక్వైరీకి వెల్తారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది.
