ఈడీ ‘పీపీ’ రాణా రాజీనామా

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా బాధ్యతల నుండి తప్పుకున్నారు. శనివారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధ్యతలకు రాజీనామ చేసినట్టు తెలుస్తోంది. దేశంలో సంచలన కేసుల విచారణలో ఈడీ స్పెషల్ కోర్టులో రాణా వాదించారు. 2015 నుండి పీపీగా కొనసాగుతున్న ఆయన బాధ్యతల నుండి తప్పుకోవడం సంచలనంగా మారింది. అయితే ఆయన కార్యాలయ వర్గాలు మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. ప్రముఖుల కేసులను వాదించిన రికార్డు రాణా సొంతమైందని చెప్పాలి. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ నేత డికె శివకుమార్, ఆర్జేడీ అధినేత లలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబ సభ్యులకు సంబందించిన కేసు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులను వాదించారు. అంతే కాకుండా అంతర్జాతీయ ఉగ్రవాదులకు సంబందించిన లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్, జమ్మూ కశ్మీర్ టెర్రర్ కేసులు, హఫీజ్ సయిద్, సయ్యద్ సల్లాఉద్దీన్ లాంటి ఉగ్రవాదుల కేసులను ఏజెన్సీ తరుపున వాదించారు రాణ. ఎయిర్ ఇండియా స్కాం, విజయ్ మల్యా, నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ, భూషన్ పవర్ అండ్ స్టీల్స్, రాన్ బాక్సీ రెలిగేర్, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ మనీ ల్యాండరిగ్ లాంటి ఉన్నత స్థాయి కేసులకు రాణా ఏజెన్సీ తరుపున ప్రాతినిథ్యం వహించారు. 44 ఏళ్ల వయసున్న రానా యూనైటెడ్ కింగ్ డమ్ కోర్టులో మనీల్యాండరింగ్ దర్యాప్తులో ఈడీ తరుపున వాదించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో “లీగల్ పవర్‌లిస్ట్ ఆఫ్ 2020″లో రాణాకు స్థానం కల్పించింది.

You cannot copy content of this page