దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించేందుకు బుధవారం ఉదయం ఈడీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లోని పలు మెడికల్ కాలేజీల్లో చేపట్టిన ఈ దాడుల్లో మేనేజ్ మెంట్ కోటా మెడికల్ సీట్ల భర్తీ అంశంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై లోతుగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కరీంనగర్ సమీపంలోని ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీల్లో కూడా ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.
Disha Dasha
1884 posts
Next Post