అక్రమ ఆస్తులతో పాటు… ఎక్సైజ్ కేసు..!

ఏసీబీ దాడుల ఎఫెక్ట్…

దిశ దశ, వరంగల్:

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరుక్కున్న రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ పై మరో కేసు కూడా నమోదు అయింది. ఏసీబీ సోదాల్లో విదేశీ మద్యం కూడా దొరకడంతో ఆయనపై ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34(ఎ) కేసు కూడా నమోదు చేశారు. శుక్రవారం వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇండ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన విధులు నిర్వర్తిస్తున్న వరంగల్, స్వస్థలం అయిన జగిత్యాల, హైదరాబాద్ లలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు ఆస్తులను, నగదును గుర్తించారు. రూ. 5జ29 లక్షల విలువైన విదేశీ మద్యం బాటిళ్లు 23, రూ. 2.79 కోట్ల విలువైన మూడు ఇండ్లు, రూ. 13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్లు, 14.04 లక్షల విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 5.85 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్, నూ. 22.85 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 43.80 లక్షల విలువైన వాహనాలు, రూ. 19.55 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 28 వేల వెండి ఆభరణాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page