‘మహా’ ప్రమాదం
దిశ దశ, ముంబాయి:
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మందిని బలి తీసుకోగా మరో 25 మందిని గాయాలపాలు చేసింది. అదుపు తప్పి బస్సు లోయలో పడి పోవడంతో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ముంబాయి పూణే హైవే మీదుగా వెల్తున్న బస్సు రాయగడ సమీపంలోని ఓ లోయలో అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించగా, లోయలో పడిన బస్సును పైకి లాగేందుకు తీవ్ర ప్రయత్రాలు చేస్తున్నారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం ఘటనతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.