అమెరికా నుండి అమాత్యులకు ఆహ్వానం

తెలంగాణ వ్యవసాయంపై ప్రంపంచానికి తెలియజేయాలని పిలుపు

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతి ప్రస్తానంపై సమగ్రంగా వివరించేందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం అందింది. అమెరికాలో జరగనున్న ఈ సదస్సుకు హాజరై తెలంగాణాలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై విశదీకరించాలని పిలుపు వచ్చింది. రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలకు ఈ ఆహ్వనం అందింది. ఈ ఏడాది అక్టోబర్ 24 నుండి 26 వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్ లో ఈ సమావేశం జరగనుంది. హరిత విప్లవ పతామహుడు నార్మన్ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. స్వరాష్ట్రం సిద్దించిన తరువాత సాధించిన విజయాలపై సమగ్రంగా వివరించేందుకు మంత్రి కేటీఆర్ ప్రసంగించాలని సంస్థ కోరింది.
ప్రపంచంలోని 1200 దేశాల నుండి అతిథులు ప్రత్యక్ష్యంగా హాజరు కానున్న ఈ సదస్సులో వర్చువల్ విధానంల కూడా వేల సంఖ్యలో ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించిన వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ సంస్థ ఈ అంశంపైనే సదస్సులో మాట్లాడవల్సిందిగా మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో కోరింది.

You cannot copy content of this page