సోదరులకు రాఖీ కట్టి కన్ను మూసిన అక్క…

దిశ దశ, వరంగల్:

సోదర సోదరిమణుల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ రోజును విషాద ఘటన చోటు చేసుకుంది. తన తమ్ముళ్లకు రాఖీ కట్టి ఓ అక్క అసువులు బాసిన ఘటన మహబుబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఓ తండాకు చెందిన మైనర్ పాలిటెక్నిక్ చదువుతోంది. ఆకతాయిలు ఆమెను గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను చికిత్స అందించేందుకు ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మైనర్ చే ఆమె తమ్ముళ్లిద్దరికి సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టింది. ఈ సందర్బంగా తమ్ముళ్లను అక్కున చేర్చుకున్న అక్క వారిని ముద్దాడి మరి ఆశీర్వదించింది. ఆ తరువాత ఆమె చివరి శ్వాస విడిచింది. రక్షా బంధన్ రోజున తమకు రాఖీలు కట్టిన కొద్దిసేపటికే అక్క కానరాని లోకాలకు చేరిందన్న వేదనతో తమ్ముళ్లిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ్ముళ్లను తనివితీరా ఆశీర్వదించిన అక్క చివరి శ్వాస విడిచిందన్న విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా చలించిపోయారు.

You cannot copy content of this page