ఎలక్షన్ డాటా అటు… కలెక్షన్ డాటా ఎటు..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్చ…

దిశ దశ, హైదరాబాద్:

శాంతి భద్రతల ముసుగులో అశాంతిని రేకెత్తించారా..? చట్టం ముసుగేసి మరీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా..? డీఎస్పీ ప్రణిత్ రావు భుజాంపై తుపాకి పెట్టి కాల్చిందెవరూ..? ప్రతి పక్ష పార్టీల నాయకులతో పాటు… బడా వ్యాపారుల ట్యాపింగ్ చేయాలని చెప్పిందెవరూ..? ఇలా ఒక్కటా రెండా ఎన్నెన్నో అనుమనాలు వస్తున్నాయి. స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ ఎస్ఓటీ విభాగాన్ని ఏర్పాటు చేసి వ్యవహరించిన తీరే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మిస్ గైడ్ చేశారా..?

అయితే హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు లక్ష్యంగా పెట్టుకోవడంతో ఎప్పటికప్పుడు పొలిటికల్ వింగ్ ఇంటలీజెన్స్ డాటా ఇవ్వడం మొదలు పెట్టినట్టుగా అంచానా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగే వారి డాటా, ముఖ్య నాయకులకు ఆర్థిక వనరులు సమకూర్చే వారు, వారికి వెన్నుదన్నుగా నిలిచేవారెవరూ..? ఇలాంటి పలు అంశాలకు సంబంధించిన వారిని గుర్తించి వారిపై ఎస్‘ఐ’బి నిఘాను కట్టుదిట్టం చేసిందని విచారణలో వెల్లడయింది. ఎస్ఓటీ సేకరించిన డాటాతో ముఖ్యనేతలకు కీలక సమాచారం అందు
తుందని ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగవచ్చని భావించేలా కొంతమంది ఇంటలీజెన్స్ అదికారులు వ్యవహరించినట్టుగా అనుమానిస్తున్నారు. నిఘా విభాగానికి చెందిన ముఖ్య అధికారులు సర్కారు పెద్దలకు కావల్సిన సమాచారం చేరవేసి మిగతా వ్యవహారాలను చక్కబెట్టుకుని ఉంటారన్న ప్రచారం సాగుతోంది.

క్రియాశీలకమా.. నామ మాత్రమా..?

అయితే ఫోనో ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి పోలీసు కస్టడీలో ఉన్న ప్రణిత్ రావు బడా వ్యాపారులతో పాటు ఇతరాత్ర ముఖ్యమైన వారి ఫోన్ల ట్యాపింగ్ చేయడం వెనక అసలు కారణాలేంటి అన్నదే పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ స్థాయి అధికారి వ్యాపారంలో వందల కోట్ల టర్నోవర్ చేసే వారి ఫోన్లను ట్యాపింగ్ చేసేంత ధైర్యం ఉంటుందా అన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఆయనకు అప్పగించిన ఆపరేషన్ కాకుండా పక్క చూపులు చూడడానికి కారణం ఆయనను పై అధికారులతో పాటు కీలకమైన వారు ప్రొత్సహించి ఉంటారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రణిత్ రావుకు ఇచ్చిన ప్రధానమైన టాస్క్, వార్ రూమ్స్ వ్యవహారాలతోనే సతమతమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి గజిబిజిలో వ్యాపారుల గురించి ట్యాపింగ్ చేసి ఆరా తీయాలనుకునే అవకశం ఉండే అవకాశం అయితే లేదని అంటున్నవారే ఎక్కువ. తనకు యాగ్జిలరీ ప్రమోషన్ రావడంతో మరింత దూకుడుగా పని చేస్తే గుర్తింపు పెరుగుతుందన్న ఆలోచనతో ప్రణిత్ రావు పై అధికారులతో పాటు ముఖ్య నాయకుల ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగి ఉంటారని దీంతో… వీవీఐపీ వ్యాపారులతో అసలైన వారు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని డీల్స్ కుదుర్చుకుని ఉంటారన్న చర్చ కూడా సాగుతోంది. ఎలక్షన్స్ డాటా అయితే తమకు ఎప్పటికప్పుడు అందుతుందని సంతృప్తి చెందడంతో మిగతా వ్యవహారాల విషయాలన్ని అసలైన వారికి తెలియకుండా జాగ్రత్తపడి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రణిత్ రావు సేకరించిన ట్యాపింగ్ డాటా మాత్రం ఎవరెవరికి చేరిందన్న విషయం తెలిస్తే వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page