విలయతాండవంలో పల్లెలు
అంధకారంలో ప్రజలు
తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ సౌధ ముట్టడికి ట్రాన్స్ కో సిబ్బంది వెల్తే.. పల్లెల్లో చేసిన ప్రకృతి విలయతాండంవంతో కరీంనగర్ లో చీకట్లు అలుముకున్నాయి. దీంతో విద్యుత్ సమస్యను సత్వరమే పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. ట్రాన్స్ కో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు వినతులు చేసిన అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో హాజరయ్యారు. దీంతో జిల్లాలో నామమాత్రంగా మాత్రమే ట్రాన్స్ కో సిబ్బంది మిగిలారు. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ చేసేందుకు అవసరమైన యంత్రాంగం అందుబాటులో లేకపోవడంతో గ్రామాలన్ని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కరీంనగర్ చుట్టు పక్కల గ్రామాల్లోనూ విద్యుత్ అంతరాయం కారణంగా గంటలు గడుస్తున్నా విద్యుత్ సరఫరా పునరుద్దరించే పరిస్థితి లేకుండా పోయింది. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ ఆందోళనకు వెల్లిన యంత్రాంగం అంతా వచ్చి తమ తమ విధుల్లో చేరితో తప్ప విద్యుత్ సమస్య పరిష్కరించే పరష్కరించే అవకాశం లేకుండా పోయింది. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడుతో పాటు సమీప గ్రామాల్లో స్థానికంగా ఉన్న ఒకరిద్దరు ట్రాన్స్ కో ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల సహకారంతో విద్యుత్ సమస్యను ట్రేస్ చేసే ప్రయత్నంలో మునిగిపోయారు. అయినప్పటికీ ఫలితం మాత్రం లేకుండా పోయింది.
బీఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్…
రాళ్ల వానకు బోడిగుండుకు తోడు కావడం అంటే ఇదేనేమో. కరీంనగర్ ప్రజలను ప్రకృతి కలవరపెడుతున్న సమయంలోనే విద్యుత్ అంతరాయం గురించి అధికారులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. బుధవారం రాత్రి కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో యంత్రాలన్ని కాలి బూడిదయ్యాయి. దీంతో బీఎస్ఎన్ఎల్ సీయూజీ వినియోగిస్తున్న ట్రాన్స్ కో అధికార యంత్రాంగానికి వెంటనే సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా విద్యుత్ వినియోగదారులకు లేకుండా పోయింది.