బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి
దిశ దశ, ఆదిలాబాద్:
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన వారికి షోకాజ్ ఇవ్వరు కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు… ఏఐసీసీ అధినేత ఖర్గేను కలిసి వివరిస్తానని ప్రకటంచిన 24 గంటల్లోనే ఆ నేత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం పంచన చేరారు.
ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో పట్టు సాధించుకున్న నాయకుల్లో ఒకరైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం బీజేపీ చీఫ్ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. రెండు రోజులుగా బీజేపీ జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీలోనే మకాం వేయగా, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం హుటాహుటిన ఢిల్లీకి వెల్లారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబూ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు తమ పార్టీలతో వైరం పెట్టుకుని దూరం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎపిసోడ్ తెరపైకి రావడం ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ముఖ్య నాయకులను చేర్చుకునే పనిలో నిమగ్నం అయిన నేపథ్యంలో ఏలేటి కమలం గూటికి చేరడం సంచలనంగా మారింది. ఏలేటీ బీజేపీలో చేరినప్పుడు రాష్ట్ర బీజేపీ ఇంఛార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సంగప్పలు ఉన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post