మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సామాజిక తనఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో వీరిని తాత్కాలికంగా విధుల నుండి తొలగిస్తూ పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పీడీ వి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఓదెల మండలంలో పని చేస్తున్న ఉపాధి హామీ పథకం అదనపు కార్యక్రమ అధికారి కొమురయ్య, సాంకేతిక సహాయకురాలు జి లీలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో వీరు విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, నిభందనల మేరకు విధులు నిర్వర్తించలేదని తేలడం ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.