మావోయిస్టులకు భారీ నష్టం
ఆయుధాలు స్వాధీనం
కొనసాగుతున్న ఎదురు కాల్పులు
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ప్రాంతంలో కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుండి రాత్రి వరకు కూడా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం నుండి బలగాలకు, నక్సల్ మధ్య పలుమార్లు కాల్పులు జరిగినట్టుగా సమాచారం. కీకారణ్యంలో నక్సల్ పోలీసుల మధ్య 6 గంటలకు పైగా ఎదురు కాల్పులు జరుగుతుండడం సంచలనంగా మారింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు బలగాలన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయని బస్టర్ రేంజ్ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టు పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి వరకు అందిన ప్రకారం 30 మంది నక్సల్ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని తెలిసింది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. చనిపోయిన మావోయిస్టుల నుండి ఏకే 47, ఎస్ఎల్ఆర్ తో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా కూంబింగ్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అభూజామఢ్ ప్రాంతం అంతా కూడా సమాచార వ్యవస్థకు దూరంగా ఉండటంతో సమగ్ర సమాచారం అందడం లేదు. ఘటనా స్థలి నుండి బలగాలు కమ్యూనికేషన్ అందించే అవకాశం ఉన్న ప్రాంతాలకు చేరుకుంటే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.