దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తోంది. సోమవారం జిల్లాలోని భామ్రాఘడ్ తాలుకాలోని కోప్రి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా అక్కడి పోలీసు అధికార వర్గాలు తెలిపాయి. చత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగతున్నాయన్న సమాచారం అందుకున్న సి 60 బలగాలతో పాటు పారా మిలటరీ బృందాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాలయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుందని గడ్చిరోలి జిల్లా పోలీసు అధికారులు చెప్తున్నారు.
మృతులు వీరే…
ప్రాథమికంగా అందిన సమాచారం బట్టి ఐదుగురు మావోయిస్టులు ఈ ఘటనలో మరణించినట్టుగా తెలుస్తోంది. 10 బెటాలియన్ కు చెందిన డీవీసీఎం జయభూరి పడా, మాడా ఏరియా సప్లై టీమ్ లో పనిచేస్తున్న ఏసీఎం సావ్జీ తుల్వి, పార్టీ సభ్యులు బసంత్ మడ్కం, దేవ్ ఉకె, సుక్మతి మడ్కంలు మరణించినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావల్సి ఉంది.