తూటాలు కక్కుతున్న తుపాకులు...
దిశ దశ, దండకారణ్యం:
ప్రశాంతతకు చేరుకున్న దండకారణ్యంలో.మళ్లీ అశాంతి మొదలైంది. కొద్ది రోజులుగా మూగబోయిన తుపాకుల మోత మళ్ళీ మోగింది. దీంతో పచ్చని అడవులు ఎరుపెక్కాయి. బీజాపూర్, కాంకేర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అడవుల్లో గురువారం ఉదయం నుండి మావోస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. DRG, STFతో పాటు ఇతర విభాగాలకు చెందిన బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఎదురు కాల్పులు ప్రారంభం అయినట్టు సమాచారం. రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలో 22మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ముక్త్ భారత్: అమిత్ షా
నక్సల్స్ రహిత భారత్ ధ్యేయంగా బలగాలు ఆపరేషన్ చేపట్టాయని కేంద్ర హోమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. X వేదికగా చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో 22మంది మావోయిస్టులు చనిపోయారని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చినాటికల్లా ముక్త్ భారత్ సాధించే లక్ష్యం సాధిస్తామన్నారు.