ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి..?
రేపు మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతం ఎదురు కాల్పులతో దద్దరిల్లిపోయింది. డీఆర్జీ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ హతం అయ్యారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చత్తీస్ గడ్ లోని దంతెవాడ, సుక్మా అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారస పడడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో డీఆర్జీ బలగాలు సోదాలు నిర్వహించగా రెండు మహిళా నక్సల్స్ మృతదేహాలను స్దాధీనం చేసుకగా, ఒక ఇన్సాస్ ఆయుధంతో పాటు 12 బోర్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే చనిపోయిన నక్సల్స్ పూర్తి వివరాలు మాత్రం తెలియరావడం లేదు. మరో వైపున దంతెవాడ జిల్లా జగర్గుండా, అరాన్ పూర్ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చివేత ఘటనలో ఒక జవాన్ కు స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. గురువారం మావోయిస్టు పార్టీ 19వ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో దంతెవాడ, సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులన ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.