దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్యంలో మరణ మృదంగం సాగుతోంది. ఒక్క ఏడాదిలో జరిగిన వివిధ ఎన్ కౌంటర్లలో 207 మంది మావోయిస్టులు వివిధ మరణించారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ఒక ప్రకటనలో తెలిపారు. గత జనవరి నుండి ఇప్పటి వరకు బస్తర్ పూర్వ జిల్లా పరిధిలోని కీకారణ్యాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలను నక్సల్స్ ఏరివేతలో నిమగ్నం అయ్యాయి. మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన నేపథ్యంలో కేవలం 11 నెలల వ్యవధిలోనే భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 787 మంది అరెస్ట్ కాగా, 789 మంది లొంగిపోయారు. మావోయిస్టుల నుండి ఇప్పటి వరకు 262 ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, దేశంలో ఒకే ఏడాది ఇంత భారీ సంఖ్యలో నక్సల్స్ చనిపోవడం ఇదే మొదటి సారని ఐజీ వెల్లడించారు.
ఎన్ కౌంటర్ మృతులు
సుక్మా జిల్లా భండార్‌పదర్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, 11 ఆయుదాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎదురు కాల్పులు జరగగా, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు ఇందులో పాల్గొన్నాయి. దంతేష్‌పురం-భండరపదర్-కొరాజ్‌గూడ మధ్య మునుర్కొండ కొండల్లో పోలీసు పార్టీకి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. ఘటనా స్థలం నుండి INSAS, AK-47, SLR, 9mm పిస్టల్‌తో సహా మొత్తం 11 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు, ఎన్ కౌంటర్ ల్ మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు డీవీసీఎం, ముగ్గురు ఏసీఎం, నలుగురు పీఎల్జీఏ సభ్యులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సౌత్ బస్తర్ డివిజన్ ఇంచార్జ్, DVCM మడ్కం మాసా, డివిజన్ స్మాల్ యాక్షన్ టీమ్ కమాండర్ లక్మా మడావి, ప్లాటూన్ కమాండర్ కర్తం కోసా, PPCM ACM, LOS కమాండర్ కోసి అలియాస్ రితిక, ఏరియా మిలిషీయా కమాండ్ ఇన్ చీఫ్, ACM ముచకి దేవా, ప్లాటూన్ సభ్యులు దూది హంగి, మడకం జీతు, మడకం కోసి, కవాసి కోసా, కుంజం వామాలు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.