ఎండోమెంట్స్ ట్రిబ్యూనల్ జీపీపై ఫిర్యాదు….
దిశ దశ, హైదరాబాద్:
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న చర్చ మొదలైంది. ఎండోస్ విభాగం భూముల కేసులను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రిబ్యూనల్ వ్యవహారాలను పట్టించుకునే వారు కరువయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒకరు దేవాదాయ శాఖ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. గవర్నమెంట్ ప్లీడర్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్న తిరుపతి రెడ్డి టర్మ్ ముగిసినప్పటికీ యథావిధిగా కొనసాగుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అమలవుతోందని కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రెండు రోజుల క్రితం ఇచ్చిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. భూములను కబ్జా చేసిన వారిపై ట్రిబ్యూనల్‌లో కేసులు నమోదు చేసి ఆ భూములకు సంబంధించిన దేవాలయానికి సంబంధించినవని వాదనలు వినిపించి కాపాడాల్సిన బాధ్యత జీపీపై ఉందని కిరణ్ కుమార్ చెప్పారు. అయితే టర్మ్ చేసారు తరువాత కూడా ఆయనే బాధ్యతలో కొనసాగుతూ నచ్చిన విధంగా పని పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలోని మంచిరేవుల వేణుగోపాలస్వామి ఆలయ భూములకు సంబంధించిన కేసు ట్రిబ్యూనల్‌లో విచారణలో ఉండగా విత్ డ్రా చేయడం అధికార దుర్వినియోగం అవుతోందని కిరణ్ కుమార్. జీపీగా టర్మ్ ప్రాజెక్ట్ తరువాత OA NO: 98/2018 కేసు దేవదాయ శాఖ ట్రిబ్యూనల్‌లో గత సంవత్సరం డిసెంబర్ 20న లిస్టింగ్‌లో ఉండగా, అదే రోజున జీపీ తిరుపతి రెడ్డి కేసును విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం. బాధ్యతల పదవి కాలం ముగిసిన తరువాత కూడా జీపీ హోదాలో తిరుపతి రెడ్డి కేసును ఎలా విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని కిరణ్ కుమార్ ప్రశ్నించారు. ఒకవేళ ఆయనను జీపీగా కంటిన్యూ చేసినట్టయితే దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఇవ్వబడుతుంది. తిరుపతి రెడ్డిని జీపీగా కొనసాగిస్తూ 2023 అక్టోబర్ 4న GORT 461 విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం ఏడాది పీరియడ్ వరకు మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే ఆయనకు గడువు ముగిసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓఆర్టీ జారీ చేయలేదని టర్మ్ నిర్వాహకులు వెంటనే ఆ బాధ్యతల నుండి తప్పుకోవల్ రెడ్డి అక్కడే కొనసాగడం నిబంధనలకు విరుద్దమని కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దేవాదాయ భూముల విషయంలో సుప్రీం, హై కోర్టులు ఇచ్చిన వాటిని అనుసరించి చొరవ తీసుకోవల్సి ఉందన్న విషయాన్న విస్మరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.