పునరుద్దరణ పనుల్లో నిమగ్నం

మరో రోజు ఆగక తప్పదా..

కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు మరో 24 గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. టెక్నికల్ మిషనరీ కూడా ఫైర్ యాక్సిడెంట్లో దగ్దం కావడంతో పునరుద్దరించేందుకు కనీసం 48 గంటల సమయం పడుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సేవలు పునురుద్దరించాలంటే మరో రోజు పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి షాట్ సర్క్యూట్ తో జరిగిన అగ్ని ప్రమాదంలో బీటీఎస్ కు చెందిన మిషనరీ అంతా కాలి బూడిదైపోయింది. సాఫ్ట్ వేర్ తో పాటు ఇతరాత్ర మిషనరీని తెప్పించి ఇన్ స్టాల్ చేయాల్సి ఉంది. అయితే బీఎస్ఎన్ఎల్ బిల్డింగ్ అంతా క్లీన్ చేసిన తరువాతే వీటిని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బిల్డింగ్ లో విద్యుత్ సరఫరా పనులను కూడా చేయిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ. 5 నుండి 6 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు నిర్దారించారు. అయితే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నెట్ వర్క్ పునరుద్దరిస్తామని కూడా వివరించారు.

You cannot copy content of this page