ఎత్తులో ఉన్నామనుకుంటే… అంతే సంగతులు… జలపాతాల వద్ద జర భధ్రం…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

భారీ వర్షాలతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెల్తున్న పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. వరద నీటి వద్దకు వెల్లడం లేదన్న ధీమాతోనే, తాము ఎత్తైన ప్రదేశంలో ఉన్నామన్న అతి నమ్మకంతో వ్యవహరిస్తే అంతే సంగతులు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. జలపాతాల వద్ద అయితే ఇలాంటి జాగ్రత్తలు మరీ ఎక్కువగా తీసుకోవల్సి ఉంది. జలపాతల నుండి జాలు వారే నీటిని చూసి తరించేందుకు సేఫ్టీ ప్లేస్ ను ఎంచుకుని దూరంగా ఉండడం బెటర్. కానీ అత్యుత్సాహంతో దూకుడుగా వ్యవహరిస్తే కన్న వారికి కడుపుకోతను మిగల్చడం, భార్య పిల్లలను అనాథలను చేయడం ఖాయం అన్న విషయాన్ని పదే పదే గుర్తుంచుకోవల్సి ఉంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష్య ఉదాహారణగా చెప్పవచ్చు. ఉడిపి జిల్లాలోని అరశినగుండి జలపాతం నుండి నీరు జాలు వారుతుండగా వీడీయో తీసుకోవాలన్న ఉత్సహంతో ఓ యువకుడు దిగువ ప్రాంతంలోని ఓ బండరాయిపై నిలబడ్డాడు. అయితే జలపాతం నుండి వచ్చి పడుతున్న పాలలాంటి నీటిని చూస్తూ తరిస్తున్న ఆ యువకుడు నీటి జల్లులు కూడా బండరాయిపై పడుతున్న విషయాన్ని విస్మరించాడు. ఓ వైపున ఎత్తైన కొండపై నుండి పడుతున్న నీటి సవ్వడులను అస్వాదిస్తూ మరో వైపున కాలు లేపి బండరాయిపై పెట్టిన మరుక్షణమే ఆ యువకుడు జారి జలపాతంలో పడిపోయాడు. నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన ఆ యువకుడని ఆనవాళ్లు కూడా కెమెరా కంటికి చిక్కలేదంటే అక్కడ నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉంది… ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు కొత్త శోభను సంతరించుకున్నాయన్న ఆనందంతో టూరిస్టులు ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు అన్న విషయం మర్చి పోకూడదు.

You cannot copy content of this page