పొన్నంపై జీవన్ రెడ్డి మల్లీ ఫైర్…
దిశ దశ, జగిత్యాల:
ఇథనాల్ ఇండస్ట్రీ చిచ్చు కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్నట్టుంది. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను ఆసరగా చేసుకుని ఆందోళనల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న జగిత్యాల జిల్లా కాంగ్రెస్ లీడర్లకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఝలక్ ఇచ్చారు. దీంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
క్రిభ్ కో డైరక్టర్ హోదాలో…
మజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ క్రిభ్ కో డైరక్టర్ హోదాలో గత నెలలో వెల్గటూరు మండలంలో జరిగిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదని పొన్నం ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుకు క్రిభ్ కో నుండి కూడా పలువురు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుకూలంగా మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టాయి. అప్టపికే స్థానికుల డిమాండ్ కు అనుగుణంగా ధర్మపురి ఇంఛార్జి, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలు ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయంటూ స్థానికులు చేస్తున్న నిరసనల పర్వానికి బాసటగా నిలవడంతో పాటు వ్యతిరేక ఉద్యమాలు కూడా చేపట్టారు. ఉన్నట్టుండి అవగాహన సదస్సులో పొన్నం ఎంట్రీ ఇవ్వడం ఇథనాల్ ఇండస్ట్రీతో ఎలాంటి నష్టం వాటిల్లదంటూ ప్రసగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిపై స్థానికుల్లో చర్చ మొదలైంది. దీనిని కవర్ చేసుకునేందుకు జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు అదంతా పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతమని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ అంశానికి పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా మరోసారి ఈ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించడంతో కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ బేధాలు బయటపడ్డాయి. దీంతో సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇథనాల్ ఇండస్ట్రీ మంటలు రేకిత్తించిందన్న చర్చ మొదలైంది. ఇథనాల్ ఫ్యాక్టరీపై పోన్నం ప్రభాకర్ స్పందించిన తీరు సరికాదని, కనీసం స్థానిక సర్పంచ్ తో మాట్లాడకుండానే అవగాహన సదస్సుకు రావడంపై సరికాదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు క్రిభ్ కో డైరక్టర్ పదవి ఊంటదో పోతదో అని మాట్లాడి ఉండోచ్చు, ఈ ప్రాంత రైతాంగం ప్రయోజనాలు కావాలా.,.? లేకపోతే క్రిభ్ కో డైరక్టర్ కావాల అంటూ ప్రశ్నించారు. ఆయనకు ఆ పదవి ఎలా వచ్చింది..? కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం వల్లే వచ్చిందని, ప్రజాభిప్రాయం ఏలా ఉందో తెలుసుకోవాలని కదా అని అన్నారు. పొన్నం తనకు ఫోన్ చేస్తే తొందరపడుతున్నవు, ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పా. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని ఇథనాల్ ప్రాజెక్టు కాలుష్యాన్ని వెదజల్లుతుందని, ప్రజాల కోరిక ప్రకారం తాము వ్యతిరేకిస్తున్నామని జీవన్ రెడ్డి అన్నారు. ఇదే జిల్లాలో మూసివేతకు గురైన షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తే అటు రైతులకు ఇటు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కిం కర్తవ్యం..?
అయితే ఇథనాల్ పరిశ్రమ చిచ్చు ఇప్పటి వరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్యంగా ఆరోపణల పర్వం కొనసాగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లోంచి బయటకు రావల్సిన అవసరం ఏర్పడింది. పొన్నం ప్రభాకర్ అవగాహన కల్పించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన ఆవశ్యకత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులపై పడింది. దీంతో పదే పదే ఇదే అంశం గురించి ప్రశ్నలు ఎదురవుతుండడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించినట్టు స్పష్టం అవుతోంది. కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఇథనాల్ మంటలు చెలరేగాయని చెప్పక తప్పదు. ఇంతకాలం ఈ ఆందోళనల్లో అప్పర్ హైండ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తగ్గుతున్న ప్రాభావన్ని పెంచుకునే దిశగా పావులు కదపాల్సి వస్తోంది. ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా వ్యతిరేకించిన అంశంతో పాటు స్థానిక ప్రజల అభిష్టాన్ని పరిగణనలోకి తీసుకునే పోరాటం చేస్తున్నామన్ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులకు. ఈ క్రమంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల నాయకుల మధ్య ఇథనాల్ ఇండస్ట్రీ అంశం మాత్రం కొత్త చిచ్చును తయారు చేసిందన్న అభిప్రాయాలు అటు ఇంట్లో ఇటు బయట వ్యక్తమవుతున్నాయి.