అర్థరాత్రి వైద్యం కోసం వస్తే డాక్టర్లు ఉండరా.?
మరోసారి బయట పడ్డ డాక్టర్ల డొల్లతనం…
పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు వైద్యం చేయని డాక్టర్లు…
మార్గం మధ్యలోనే గర్భిణీ నార్మల్ డెలివరీ…
39 మంది వైద్యుల్లో నాడి పట్టేవారే కరువు…
దిశ దశ, వరంగల్:
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి పేరుకే పెద్దాసుపత్రిలా దర్శనమిస్తోంది. ఇటీవల దీన్ని ఏరియా ఆసుప్రతిగా పేరు మార్చారు. పాత గోడలకు కొత్త సున్నాలు వేస్తున్న అధికారులు, అదే స్థాయిలో రోగులకు మాత్రం వైద్యం అందించడం లేదనే విమర్శలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఇక్కడి వైద్యులకు పరిపాటి మారింది. అర్థరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రి తలుపు తడితే కుంటి సాకులు చెప్పి గర్భిణీ మహిళకు వరంగల్కు పంపించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హట్ టాపిక్గా మారింది. దీంతో వర్తన్నపేట డాక్టర్ల డొల్ల తనం మరోసారి బట్ట బయలైంది.
30 కిలో మీటర్ల దూరం నుండి…
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర నాగమణి అనే గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు అంబులెన్సులో వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పరీక్షించారు. డాక్టర్లను పిలవాలని, నొప్పులతో తీవ్రంగా బాదపడుతోందని భాదితులు ప్రాదేయపడగా, బేబి మోషన్ మింగిందని, ఉమ్ము నీరు తక్కువగా ఉందని సిబ్బంది బదులిచ్చారు. డాక్టర్లు వస్తే చూస్తారని తెలపగా, గర్భం దాల్చడానికి దారి సరిగ్గా లేదని, ఆపరేషన్ ఉంటేనే వైద్యులు వస్తారని సిబ్బంది చెప్పారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు, బేబికి అత్యవసర వైద్యం చేద్దామన్నా ఆసుపత్రిలో పరికరాలు లేవని వరంగల్ సీకెం ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో భాదితులు చేసేదేమి లేక మరో అంబులెన్సులో వరంగలకు తీసుకెళ్లారు.
కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డాం…
గర్భిణి మహిళ నాగమణి కుటుంబసభ్యులు మాట్లాడుతూ అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి వచ్చి వైద్య సిబ్బందిని ఆపరేషన్ చేయాల్సిందిగా కాళ్ల మీద పడి ప్రాదేయ పడ్డామని తెలిపారు. ఆ సవ యంలో మాకు వైద్యులు కనిపించ లేదని, వైద్యులను పిలిపించండని అడిగితే ఆపరేషన్ చేయడానికి మాత్రమే వస్తారని వైద్య సిబ్బంది బదులిచ్చారని చెపుతున్నారు. రాత్రి పురిటి నొప్పులతో భాదపడటం చూసి మేము ఎంతో భయాందోళనకు గురయ్యామని, వైద్యం చేయాలని సిబ్బంది కాళ్ల మీద పడి ప్రాదేయపడిన వరంగల్ తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. దీంతో అర్థరాత్రి 2 గంటల సమయంలో వరంగల్ వెళ్తుండగా మార్గం మధ్యలో పందిని సమీపంలో అంబులెన్సులో నాగమణికి సుఖ ప్రసవం జరిగి మగ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమం గానే ఉన్నారని, బేబీ మోషన్ మింగడం లాంటిదేమి లేదని సీకేఎం వైద్యులు చెప్పారని తెలిపారు. డాక్టర్లు ఆసుపత్రిలో లేక సిబ్బంది చేయాలంటే భయపడి ఆర్థరాత్రి నొప్పులతో వచ్చిన వారిని పం పించడం దారుణమని ఆరోపించారు.
బయట పడ్డ డొల్లతనం…
వర్ధన్నపేట సీహెచ్సీ డాక్టర్ల డొల్ల తనం మరోసారి ఈ ఘటనతో బహిర్గతమైంది. ఏరియా ఆసుప్రతని బోర్డు తలిగించి, 24 గంటల వైద్యం చేస్తామని, డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెపుతూ మోసం చేస్తున్నారని భాదితులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 39 మంది వైద్యులు కలిగిన అసుపత్రిలో సిబ్బంది రోగులను పరీక్షించడం విడ్డూరంగా ఉందంటున్నారు. దీనికి తోడు ఎమెర్జెన్సీ సమయ ంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పట్ల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు కనిపించకుండా పోవడం వెనక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంట ఉన్నారు. లేదా డ్యూటీలో ఉండి కూడా నిద్రపోతు సిబ్బంది చేత లేరని చెప్పించారా అనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రమాదం జరిగి ఉంటే
వైద్యుల తీరుతో పురుటి నొప్పులతో భాదపడుతున్న నాగమణికి జరగరాని ప్రమాదం జరిగి ఉంటే, తల్లితో పాటు బిడ్డ కూడా క్షేమంగా ఉం డేవారు కాదని భాదిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేసే RE: వైద్యులు ఇలా ఆసుపత్రికి వచ్చిన వారిని వెనక్కి పంపడం సరైంది కాదని చెపుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, వైద్యాధికారులు పట్టించ కోకపోవడంతో రాత్రి వేళల్లో వర్ధన్నపేటలో వైద్యం అందడం లేదని ఆరోపిస్తున్నారు. పేరుకే పెద్దాసుపత్రిగా ఉండి ఇంత మంది డాక్టర్లు ఉం డి ప్రజలకు ఏం లాభమో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. తొర్రూరుకు, వరంగల్కు మధ్యలో ఉన్న వర్ధన్నపేటలో ఆసుపత్రికి రావాలంటే భయాందోళన కలుగుతోందని అంటున్నారు. నిర్లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులను, డ్యూటీలో లేకుండా పోయిన డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హ్యట్సాఫ్ టెక్నిషియన్…
అసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో 108 అంబులెన్సుకు భాదితులు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన అంబులెన్సు పైలెట్ ఎల్లగౌడ్, మెడికల్ టెక్నిషియన్ సదానందంలు హుటాహుటిన అనుపత్రికి చేరుకున్నారు. వెంటనే పురుటి నొప్పులతో భాదపడుతున్న నాగమణిని వరంగల్ సీకేఎంకు తరలిస్తుండగా, పందిని గ్రామ శివారులో నాగమణికి తీవ్రంగా నొప్పులు రావడంతో మెడికల్ టెక్నిషియన్ సదానందం చాకచక్యంగా ఆమెకు నార్మల్ డెలివరీ చేశాడు. దీంతో మగ శిషువు జన్మించాడు. ఆసుపత్రిలో డాక్టర్ల విషయం పై అంబులెన్సు సిబ్బందిని ప్రశ్నించగా, మాకు కూడా డాక్టర్లు కనిపించలేదని బదులిచ్చారు. బేబి మోషన్ మింగి ఉందని, ఉమ్ము నీరు తక్కువ ఉందనే విషయాలు సైతం నిజం కాదని చెప్పకనే చెపుతున్నారు. ప్రసవం జరిగిక తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అంబులెన్సు సిబ్బంది చాకచక్యం పట్ల, వారి పనితీరు పట్ల భాదిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు.