మిస్సింగ్ మిస్టరీ

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా ఈవీఎంల స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులు మిస్సయినట్టుగా తెలుస్తోంది. అత్యంత భద్రంగా కాపాడాల్సిన కీస్ అదృశ్యం సంచలనంగా మారింది. ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 17ఏ, 17సి డాక్యూమెంట్లను స్కాన్ చేసి హై కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సోమవారం స్ట్రాంగ్ రూంలో వీటిని బయటకు తీసేందుకు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి సమాయత్తం కాగా ఎలక్షన్ పిటిషన్ ఉన్న స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులే లేకపోవడంపై అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తాళం చేతుల జతలు ఉండాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ కంట్రోల్ లో ఉండాల్సిన తాళం చేతులు మాయం కావడం సంచలనంగా మారింది. అసలు ఈ తాళం చేతులు ఎలా పోయాయన్నదే అంతుచిక్కకుండా పోయింది. కలెక్టరేట్ యంత్రాంగం ఆదివారం నుండే అన్వేషించినా ఫలితం లేకుండా పోవడంతో ఈ రోజు స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టాలని అధికారులు భావించారు. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాళం చేతులు మిస్సయిన విషయాన్ని హై కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకున్న తరువాత తాళాలు పగలగొట్టాలని అంటున్నారు. దీంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.

You cannot copy content of this page