BREAKING NEWS: ఏపీలో సంచలనం కల్గిస్తున్న అంశం

85 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం

ఎనిమిదిన్నర దశాబ్దాల వయసులో ఉన్న ఆ పెద్దాయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆయన చేయనున్న ఆమరణ దీక్షపై సర్వత్రా చర్చ సాగుతోంది. తెలుగునాట క్రియాశీలక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు ఆమరణ దీక్ష పట్టడం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్ తో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. సోమవారం నుండి దీక్షకు పూనుకుంటున్నానని, తనకు రాష్ట్రంలోని కాపు, తెలుగు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన అభ్యర్థించారు. ఆరు దశాబ్ధాలకు పైగా తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధిగా భాద్యతలు నిర్వర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చే విషయంపై ఇటీవల కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ అంశం ప్రచారస్త్రంగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీనివల్ల ఏసీ సీఎం జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్ని ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2024లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం తమకు కలిసి వచ్చిందని కాపుల రిజర్వేషన్ అంశాన్ని పాశుపతాస్త్ర్రంగా ఉపయోగించుకోవాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీన పడేలా చేసేందుకు అవసరమైన ఎత్తులు వేస్తూ ప్రజల దృష్టిని మరల్చుకోవాలని చూస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీసుకున్న నిర్ణయం తమకు మరింత కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. కాపు, బలిజ, తెలుగు సామాజిక వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు హరిరామ జోగయ్య అమరణ దీక్షను వాడుకునే పనిలో నిమగ్నం అయ్యాయి.

ఆ మౌనం వెనక…?

అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రిజర్వేషన్ల అంశంపై పెదవి విప్పడం లేదు. కేంద్రం ఇచ్చిన వెసులుబాటును ఆసరగా తీసుకుని 5 శాతం రిజర్వేషన్ ఇస్తానని కాని ఇవ్వనని కాని చెప్పడం లేదు. దీంతో ఆయన మదిలో ఏముందోనన్న విషయం అంతుచిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై గగ్గోలు పెడుతున్న విషయాన్ని గమనిస్తున్న ఆయన వ్యూహాత్మకంగానే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. రిజర్వేషన్ అంశంపై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయంతో ప్రతి పక్షాలపై మరోసారి ఆదిపత్యం ఎలా చెలాయించాలి అన్న విషయంపై భారీ స్కెచ్ వేసి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తన మనసులోని మాటను మాత్రం జగన్ బయటకు చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలను తిప్పి కొట్టకుండా ముందుకు సాగుతుండడం పజిల్ గా మారిపోయింది.

You cannot copy content of this page