నదిలో తవ్వకాలతో… గ్రామాల్లో లారీలతో తంటా…

సిర్సపల్లిలో ఇసుక లారీల అడ్డుకున్న గ్రామాస్థులు

దిశ దశ, హుజురాబాద్, మానకొండూరు:

మానేరు నది పరివాహక ప్రాంత వాసుల పరిస్థితి ఓలా తయారైతే… నది సమీపంలోని పల్లెల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నదిలో ఇసుక తవ్వకాలతో తంటా మొదలు కాగా పల్లెల్లో లారీల రాకపోకలు, హారన్ల మోతలతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. పల్లె పల్లెన ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామాల్లోని జనం ఎక్కడికక్కడ ఇసుక లారీలను నిలిపివేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచులు ఆయా ప్రాంతాల వాసులకు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పాలి. వారం క్రితం మానకొండూరు శివార్లలో రెండు రోజుల పాటు లారీలను ఎక్కడిక్కడ నిలిపివేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లి వాసులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం సిర్పపల్లి రోడ్డుపై దాదాపు గంట సేపు ఆందోళన చేపట్టారు స్థానికులు. తెల్లవార్లూ తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిర్సపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులు సిర్సపల్లికి చేరుకుని నాలుగు ఇసుక లారీలు, మూడు మొరం టిప్పర్లను స్టేషన్ కు తరలించారు.

సిర్సపల్లి వాసులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన లారీలు

రాత్రిళ్లే రవాణా ఎందుకు..?

మానేరు పరివాహక ప్రాంతంలో బాజాప్తాగా ఏర్పాటు చేసిన ఇసుక రీచుల నుండి రవాణా చేస్తున్న లారీలు రాత్రి పూటే ఎందుకు బయలు దేరుతున్నాయి..? ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే లోడింగ్ విధానం ఉండాలన్న నిభందనలు ఉన్నప్పటికీ సమీప గ్రామాల్లోకి మాత్రం సాయంత్రం తరువాతే ఎందుకు చేరుకుంటున్నాయి..? లారీల తప్పిదమా రీచు నిర్వహాకుల తప్పిదమా..? అసలేం జరుగుతోందన్నదే అంతుచిక్కకుండా పోతోంది. రీచులకు సూదూర ప్రాంతాలకు రాత్రి చేరుకున్నాయంటే సమయం పడుతుందని అనుకోవచ్చు కానీ మానేరుకు దగ్గరగా ఉన్న గ్రామాలకు చేరే సరికే రాత్రి ఎందుకు అవుతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనక ఎన్న మర్మమేమిటో తేల్చాల్సిన అవరసరం కూడా ఉంది. ఎందుకుంటే నిభందనల ప్రకారం టీఎస్ఎండీసీ టెండర్ ద్వారా ఇసుక రీచులను నిర్వహిస్తోంది. ఆన్ లైన్ పేమెంట్ సిస్టం ద్వారా ఆన్ లైన్ లో వే బిల్లులు ఇస్తోంది. అంతా ఆన్ లైన్ లో జరుగుతున్నప్పటికీ లారీలు మాత్రం అర్థరాత్రి ఎందుకు వెల్తున్నాయి..? అసలు కారణాలు ఏంటో తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. అర్థరాత్రి జనజీవనం స్తంభింపజేసే విధంగా లారీలు తిరుగుతుండడం వల్ల పల్లెలన్ని ప్రశాంతతను కోల్పోతున్నాయన్నది వాస్తవం. నిద్రకు దూరమై, డస్ట్ వళ్ల అనారోగ్యాల పాలై వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

ఆ ప్రాంతంలో అలా…

గతంలో భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సమీపంలోని గోదావరి నదిలో కూడా పెద్ద ఎత్తున ఇసుక రీచులను ఏర్పాటు చేసింది సర్కారు. నిత్యం వందాలాది లారీలు ఇక్కడి నుండి ఇసుక తరలించేందుకు తిరుగుతుండేవి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవించడంతో్ స్కూలుకు వెల్లే విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చనిపోవడం సరికాదని భావించిన కాటారం సబ్ డివిజన్ పోలీసులు చొరవ తీుసుకున్నారు. అప్పటి నుండి మహదేవపూర్, కాటారం తదితర ప్రాంతాల మీదుగా వెల్లే లారీలను ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఇసుక లారీలను శివార్లలోనే నిలిపివేయాలని సూచించారు. ఇసుక రీచుల నిర్వహకులు, లారీ ట్రాన్స్ పోర్టు ఏజెన్సీలు ఈ విధానాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా పోలీసు అధికారులు సూచించిన సమయంలో ప్రత్యేకంగా రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి భారీ వాహనాలు గ్రామాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా నిలువరించే వారు. ఒక వేళ వస్తే మాత్రం భారీగా జరిమానా విధించే సాంప్రాదాయం స్టార్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడినట్టయింది. ఇలాంటి సొల్యూషన్ ఒకటి మానేరు పరివాహక ప్రాంతలో కూడా తీసుక రావల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page