కలెకర్టర్ కు వినతి
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా మైనింగ్ కార్యకలాపాల విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మానేరు పరివాహక ప్రాంత వాసులు. తాజాగా సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఆయా గ్రామాల వాసులు ఇసుక కార్యకలాపాలను ఎక్కడికక్కడ నిరోధించేందుకు చొరవ చూపాలని అభ్యర్థించారు. ఎన్జీటీ ఉత్తర్వులను హై కోర్టు నిలిపివేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలకు బ్రేకులు వేయాలని. మళ్లీ విచారణ వరకు కొనసాగించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లాలోని కొన్ని రీచుల్లో ఇసుక సేకరణ యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వినతి పత్రం అందజేయాల్సి వచ్చిందని వారు వివరించారు. ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ) లేనట్టయితే కరీంనగర్ జిల్లాలో ఇసుక తవ్వకాలు జరకూడదని ఎన్జీటీ మొదట ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కరీంనగర్ జిల్లా సాండ్ కమిటీ ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఇచ్చిన అనుమతులు రద్దు చేసిందని వివరించారు. అయితే ఈ విషయంపై టీఎస్ఎండీసీ హై కోర్టును ఆశ్రయించి ఎన్జీటీ ఉత్తర్వులను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు హైకోర్టు నిర్ణయం వెలువరించడంతో మళ్లీ ఇసుక తవ్వకాలకు క్లియరెన్స్ ఇచ్చినట్టయింది. దీంతో హై కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు హై కోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ వచ్చే నెల 10కి విచారణను వాయిదా వేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలకు బ్రేకులు పడినట్టయింది. అయినప్పటికీ ఇసుక సేకరణ నిలిపివేయకపోవడంతో స్థానికులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. దీంతో కొంతమంది అధికారులు ఈ విషయంపై జోక్యం చేసుకుని మైనింగ్ కార్యకలాపాలపై స్టే ఇచ్చారు కానీ రవాణాకు కాదన్ని విషయాన్ని తెరపైకి తీసుకరావడం, తమకు ఇంతవరకు సుప్రీం కోర్టు ఉత్తర్వులే అందలేదని చెప్పడంతో ఖంగుతిన్న స్థానికులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కరీంనగర్ కలెక్టర్ సీరియస్..?
సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు నడుచుకోవడం లేదన్న వింషయంపై కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇసుక క్రయ విక్రయాల వ్యవహారంపై టీఎస్ఎండీసీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలోని 8 ఇసుక రీచులపై సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ రోజు నుండి ఇసుక రీచుల వద్ద ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగవద్దని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశాలతో జిల్లాలో ఇసుక కార్యకలాపాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడినట్టయింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post