అర్చకుల సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు

దిశ దశ, కరీంనగర్:

గ్రామీణ ప్రాంత ధూప,దీప నైవేద్య అర్చకుల సమస్యలపై రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ తెలిపారు. శుక్రవారం తీగల గుట్టపల్లిలోని శివభక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ లను కలిసి వివరించామని ఆయన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు  సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి గ్రామీణ ప్రాంత అర్చకుల సమస్యలను వివరిస్తామన్నారు. అర్చకులకు దేవాదాయ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందజేయాలని, ఐదు లక్షల ప్రమాద బీమా, ఐదు లక్షల ఆరోగ్య భీమా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా గౌరవ వేతనానికి ఎంపికైన అర్చకులు వేతనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో వేతనాలు అందుతాయన్నారు. సంఘ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్న గౌరవ అధ్యక్షులు వేటూరి ఆంజనేయ చారిని సంఘం నుండి బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింహాచలం ప్రభాకరాచార్యులు, జిల్లా శాఖ అధ్యక్షులు నాగరాజు సంపత్ కుమార్ ఆచార్యులు, సలహాదారులు మనవాల చక్రపాణి, అరవరాజు బాలరాజు, పెద్దపెల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు అడ్డగుంట దామోదరాచారి, కాండూరి వాసు, హరిదాసు హరి కుమార్, సుమన్ శాస్త్రి, సంతోష్, సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

You cannot copy content of this page