దిశ దశ, ఏపీ బ్యూరో:
స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడగించింది. అక్టోబర్ 5 వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించిన విచారణ కోసం రెండు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించగా శని, ఆదివారాలతో ముగిసింది. అనంతరం జరిగిన విచారణలో ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడగిస్తున్నట్టు పేర్కొంది. రాజమండ్రి జైలులోనే రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడును విచారించిన సీఐడీ అధికారులు ఆదివారం సాయంత్రంతో ముగించారు.