లైంగిక వేధింపులు ట్రెండ్ మార్చుకున్నాయా అనిపించక మానదు ఈ సంఘటనను చూస్తే. ఇప్పటి వరకు మగవాళ్లు ఆడవారిపై లైంగిక వేధింపులకు పాల్పడటం.. అత్యాచారాలు చేయడం చేశాం కానీ ఇక్కడ ఓ యువతి తన సొంత చెల్లెలు పైనే వేధింపులకు పాల్పడింది. తన కోరిక తీర్చాలని పట్టుబట్టింది. ఈ నీచ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..
ఉన్నత చదువులు చదివిన పుణేకు చెందిన యువతి (24)కి పెళ్లి అయింది. కొద్ది రోజులు కాపురం చేశాక.. భర్తకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె విమానగర్‌లో ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో తన అక్క దగ్గర ఉండేందుకు ఇటీవల ఆమె సొంత చెల్లెలు (18) వచ్చింది. అయితే భర్తతో శృంగారం అలవాటు పడిన వివాహిత రాత్రి కాగానే ఆ కోరికలు ఆపుకోలేక సమతమయ్యేది. ఈ క్రమంలో ఆమె చూపు తన చెల్లెలుపై పడింది.
ఈ నెల 23న రాత్రి హాల్లో పడుకున్న తన చెల్లెలి దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చాలని పట్టుబట్టింది. అసభ్యంగా ప్రవర్తించింది. అది తప్పని చెల్లి ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకుండా శృంగారం చేయాలని ఫోర్స్ చేసింది. ఎలాగోలా ఆ రాత్రి తప్పి్ంచుకున్నా.. తరువాతి రోజుల్లో కూడా మళ్లీ మళ్లీ అదే రిపీట్ కావడంతో చెల్లెలు పోలీసులను ఆశ్రయించింది. రాత్రి కాగానే తన అక్క తనను లైంగికంగా వేధిస్తుందని ఆమె ఈరోజు పుణె ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివాహితకు కౌన్సిలింగ్ నిర్వహించి భర్త వద్దకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.