ఫేక్ యాప్స్… బీ కేర్ ఫుల్..

ఫేక్ యాప్స్ విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. నకిలీ యాప్స్ క్రియేట్ చేసుకుని డబ్బులు డ్రా అయినట్టుగా వారి మొబైల్ స్క్రీన్ పై చూపిస్తారు… కానీ నిజానికి డబ్బులు మీ అకౌంట్లో యాడ్ కావు. ఇలాంటి ఫేక్ యాప్స్ ను క్రియేట్ చేసిన ఛీటర్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. కానీ తాజాగా పెద్దపల్లి జిల్లాలోనూ ఇలాంటి ఛీటింగ్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు పోలీసులు. సుల్తానాబాద్ పట్టణంలోని ఓ వ్యాపారిని బుధవారం మోసం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆయిల్ కొనేందుకు వచ్చి ఫేక్ యాప్స్ ద్వారా అమౌంట్ ట్రాన్సఫర్ చేసినట్టుగా చూపించి ఉడాయించారు. అకౌంట్లో డబ్బులు పడలేదన్న అసలు విషయం తెలియడంతో వ్యాపారి తాను మోసాపోయానని గుర్తించారు. డబ్బులు చెల్లించేందుకు షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కానర్లు పెట్టుకోవడంతో పాటు స్పీకర్ అటాచ్ చేసినట్టతే అకౌంట్లోకి డబ్బులు బదిలీ అయ్యాయా లేదా అన్న విషయం వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి ఛీటర్స్ వలలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు పోలీసులు.

You cannot copy content of this page