ఫేక్‌ సర్టిఫికెట్ల స్కామ్.. రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని.. ఈ స్కామ్‌లో ఎంఐఎం పాత్ర ఉందని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్‌లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా జీహెచ్ఎంసీ ఒక సాఫ్ట్‌వేర్‌‌ను రూపొందించింది. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. బర్త్‌తో పాటు డెత్‌ సర్టిఫికెట్‌లను జారీ చేశారు. అలాగే నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వీటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు .

ఫేక్‌ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లేదే కీలక పాత్రగా పోలీసులు నిర్ధారించారు. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. గత డిసెంబర్‌లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

You cannot copy content of this page