ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు డిఫరెంట్ గా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రజలే మా కుటుంబ సభ్యులంటూ ప్రసంగాలు గుప్పించే నాయకుల కుటుంబ సభ్యులే వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి భిన్నంగా సాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. రక్తం పంచుకు పుట్టిన వారిని తమతో పాటు నడిపించడంలో విఫలం అవుతున్న నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుడడం గమనార్హం.

అన్నా చెల్లెల్లు….

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయినట్టయింది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నా చెల్లెల్ల అనుభందం ఆధర్శనీయంగా కొనసాగినా ఆ తరువాత జరిగిన పరిణామాలు విడదీశాయి. దీంతో పుట్టినిల్లు వదిలిసేసిన షర్మిల మెట్టిల్లున్న తెలంగాణలో వైఎస్సార్టీపీ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణాలో పాదయాత్రలు చేస్తూ ప్రజల్లో పట్టు బిగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె సక్సెస్ కాలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసిన షర్మిల ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా, ఏపీ ముఖ్యమంత్రిగా ఆమె అన్నయ్య జగన్ కొనసాగుతుండగా ఆమె మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా జరుతున్న ఎన్నికల్లో కూడా ఇరువురు ప్రత్యర్థులుగా ముందుకు సాగుతున్నారు.

అక్కా చెల్లెల్లు…

ఇకపోతే పొత్తులతో ఒకటైనప్పటికీ పార్టీలు మాత్రం వేర్వేరే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఉండగా… బీజేపీ స్టేస్ చీఫ్ గా దగ్గుబాటి పురందేశ్వరి కొనసాగుతున్నారు. పురందేశ్వరీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ స్వయాన అక్కచెల్లెల్లుగా పాలిటిక్స్ విషయంలో మాత్రం వీరిమద్య వైరుద్యం ఉంది. ఎన్టీ రామారావు పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో మామా అడుగుజాడల్లో పురంధేశ్వరీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు టీడీపీలో కొనసాగారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత టీడీపీలోకి చేరిన చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా తోడల్లులిద్దరు కూడా దూరం అయ్యారు. టీడీపీ చంద్రబాబు నాయకుడు చేతుల్లోకి వెల్లిన తరువాత కూడా పురంధేశ్వరీ ఫ్యామిలీకి, పురధేశ్వరీ ఫ్యామిలీకి మధ్య సాన్నిహిత్యం అంతంతమాత్రంగానే అన్న ప్రచారం జరిగింది. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంవలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో దగ్గుబాటి, నారా వారి కుటుంబాలు ఒకే ప్రచార వేదికలపై కనిపిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగానే ఓట్లు అభ్యర్థించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నప్పటికీ భువనేశ్వరీ టీడీపీలో ఉండగా, పురంధేశ్వరీ బీజేపీలో కొనసాగుతున్నారు. పురంధేశ్వరీ, భువనేశ్వరీ సోదరుడు బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా హిందూపురం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కొణిదెల బ్రదర్స్…

ఇకపోతే రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్క్ పాలిటిక్స్ చూపించాలని భావించి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కొణిదేల బ్రదర్స్ కూడా వేర్వేరు పార్టీలోనే కొనసాగుతున్నారు. 2009లో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వర్తించిన తమ్ముడ పవన్ కళ్యాణ్ అన్న వెంటే నడిచారు. ఆ తరువాత చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి కాగా పవన్ కళ్యాణ్ మాత్రం అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు. ఆ తరువాత జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాన్ ఏపీ పాలిటిక్స్ లో పార్టీ పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సారి మాత్రం బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంటూ ప్రకటించారు. ఇటీవల తమ్మడు పవన్ కు చిరంజీవి ఆర్థిక సాయం చేసినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీ నేతేనన్న వాదనలు వినిపించారు ఏపీ కాంగ్రెస్ నాయకులు. దీంతో జాతీయ పార్టీలో అన్న.. సొంత పార్టీ చీఫ్ గా తమ్ముడు కొనసాగుతున్నట్టు స్పష్టం అయింది. అయితే వీరి మరో బ్రదర్ నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్ తోనే జనసేనలో కొనసాగుతుండడం విశేషం.

You cannot copy content of this page