ఇంద్ర లోకానికి చెందిన వారం భూ లోకంలో ఎందుకు..?

శివయ్య చెంతకు చేరుదాం పదా…

ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన మహిళ…

బాధిత కుటుంబం ఆందోళన

దిశ దశ, కరీంనగర్:

ఇంద్రలోకానికి చెందిన వారం మనమంతా… గత జన్మలో నీవు శివయ్య భార్యవు… ఆయన చెంతకు వెల్దాం పదా అంటూ ఓ అభాగ్యురాలికి మాయమాటలు చెప్పి త వద్దకు పిలిపించుకుంది మరో మహిళ. నా భార్యను నాకు అప్పగించండంటూ వేడుకుంటున్న ఆ భర్తకు మాత్రం సహకారం అందించే వారు లేకుండా పోయారు. దీంతో తనకు న్యాయం చేయండి మహాప్రభో అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నాడు.

అసలేం జరిగిందంటే..?

తెలంగాణాలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరారం గ్రామానికి చెందిన మల్లేష్ ఇంటి పక్కన బాతుల పెంపకం కోసం వచ్చిన ఏపీలోని ప్రకాషం జిల్లా లింగసముద్రం మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన కృష్ణవేని అనే మహిళ అద్దెకు నివాసం ఉండేది. కొంతకాలంగా ఇక్కడే ఉంటున్న అంకమ్మ మల్లేష్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెదిలింది. మల్లేష్ భార్య భాగ్య, అతని కూతుర్లు స్మెలీ, రక్షితలతో అనుబంధం పెంచుకున్న కృష్ణవేని కల్లబొల్లి మాటలు చెప్తూ ట్రాప్ లో పడేసింది. కొద్ది రోజుల తరువాత తన సొంత గ్రామానికి వెల్లిన కృష్ణవేణి తరుచూ భాగ్యతో ఫోన్లో మట్లాడుతుండేది. ఈ క్రమంలో భాగ్య తన ఇద్దరు కూతర్లను వెంట తీసుకుని కృష్ణవేణి నివాసం ఉంటున్న ముత్యాలపాడుకు వెల్లిపోయింది. అక్కడ కృష్ణవేణి, అంకమ్మలు భాగ్యను మాయమాటలతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. గత జన్మలో నీ భర్త శివుడు, మనమంతా ఇంద్రలోకంలో ఉండే వారం మనం అక్కాచెల్లెల్లం అని నమ్మబలికింది. అంకమ్మ మాటలు నమ్మిన మల్లేష్ భార్య, ఇద్దరు కూతుర్లు ముత్యాల పాడులో వారివద్దే ఉండిపోయారు.

భక్త కన్నప్ప కథలా..?

భక్త కన్నప్పను మరిపించే విధంగా భాగ్యను ట్రాప్ చేశారని బాధితుడు మల్లేషం తల్లి పోచమ్మ మాటలను బట్టి అర్థం అవుతోంది. అటవీ ప్రాంతంలో ఉన్న శివ లింగం కంటి నుండి నీరు కారితే భక్త కన్నప్ప తన కన్ను తీసి శివుడికి సమర్పించగా, మరో కన్ను నుండి నీరు కారడాన్ని చూసిన కన్నప్ప మరో కన్నును కూడా శివయ్యకు సమర్పించాడు. దీంతో శివుడు సాక్షాత్కరించి భక్త కన్నప్పకు మోక్షం కల్గించాడని చరిత్ర చెబుతోంది. అచ్చం ఈ కథను మరిపించే విధంగా భాగ్య తన రక్తాన్ని శివయ్యకు సమర్పిస్తే ఆయన ప్రత్యక్ష్యం అయి ఇంద్రలోకానికి తీసుకెల్తాడని నమ్మించినట్టుగా పొచమ్మ వివరించారు.

ఏడు జిల్లాల్లో…

ఏడడుగుల బంధంతో దాంపత్య జీవనంలోకి అడుగు పెట్టిన మల్లేషం, భాగ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు జన్మించాడు. అయితే కృష్ణవేని, అంకమ్మల ట్రాప్ లో చిక్కుకున్న భాగ్య ఆచూకి కోసం భర్త మల్లేషం ఏపీలోని ఏడు జిల్లాలు తిరిగాడు. కనిపంచకుండా పోయిన తన భార్యా బిడ్డల కోసం పోలీసులకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఏపీలో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న మల్లేషం ఏపీలోని ఏడు జిల్లాల్లో తిరిగి భార్య భాగ్యతో పాటు ఇద్దరు కూతుర్ల ఆచూకి గుర్తించాడు. ఊరు వాడ కలియతిరుగుతున్న మల్లేషం ముత్యాలపాడులోని ఓ ఇంటి ఆవరణలో తన బిడ్డలకు చెందిన దుస్తులను గమనించి వారు ఆచూకి తెలుసుకున్నాడు. అక్కడి పోలీసుల సహాకారంతో భార్య బిడ్డలను సొంత ఊరికి తీసుకవచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. తమను శివయ్య ఇంద్రలోకానికి తీసుకెళ్తాడని నీవు నా భర్తవు కానేకాదని భాగ్య, మా తండ్రివి కాదని కూతుర్లు అనడంతో ఖంగుతిన్నాడు. ఓ చీకటి గదిలో ఉన్న వారి పరిస్థితిని చూసిన మల్లేషం కన్నీటి పర్యంతం అయినప్పటికీ వారు మాత్రం అతనిలో కలిసి వచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో తనకు న్యాయం చేయాలని మల్లేషం పోలీసులను వేడుకున్నా లాభం లేకుండా పోయింది.

ఇంద్రలోకం… భూలోకం…

భూలోకంలో ఉన్న మల్లేషం భార్య, ఇద్దరు కూతుర్లు ఇంద్రలోకానికి చెందిన వారంటూ నమ్మించిన కృష్ణవేణి కారణంగా తన కుటుంబం ఛిన్నాభిన్నమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకు శివ శంకర మనోహర్ ను తనవద్దే వదిలి వెల్లిన వారి కోసం ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్ముకుని ఏపీ అంతటా తిరిగనని ఆవేదన వ్యక్తం చేశాడు తొమ్మిది నెలలుగా తన వారి కోసం తిరిగి ఆచూకి దొరకబట్టినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నాడు. తన సమస్యను పరిష్కరించాలని ఏపీ, టీజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను అభ్యర్థిస్తున్నాడు మల్లేషం.

You cannot copy content of this page