ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
దిశ దశ, మంచిర్యాల:
పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్థుల కోసం ఏర్పడిన విబేధాలు కాస్తా ప్రాణాలు తీసుకునే వరకూ చేరుకున్నాయి. తరతరాలుగా సగుతున్న ఈ పంచాయితీ ఇప్పుడు హత్యలు చేసుకునే పరిస్థితికి చేరడం కలకలం సృష్టిస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన సంచలనంగా మారింది. జిల్లాలోని రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామానికి వ్యవసాయ భూమి విషయంలో ఇరు కుటుంబాలకు మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో సోమవారం ఇరు వర్గాలు దాడికి పూనుకోవడంతో బక్కమ్మ, నర్యయ్యలతో పాటు మరోకరు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. తాతల కాలం నాటి ఆస్థులకు సంబందించిన విబేధాలే ఇందుకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన రెబ్బెన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post