ఫైనాన్స్ తీసుకుని మంత్లీ ఇన్ స్టాల్ మెంట్స్ చెల్లించకపోతే వాహనాలను సీజ్ చేసేందుకు కంపెనీలు ప్రత్యేకంగా ఓ టీమ్స్ ను ఏర్పాటు చేస్తుంటాయి. వెహికిల్ సీజింగ్ చేసి తమకు అప్పగిస్తే ఇంత మొత్తంలో ముట్ట చెప్తామని రికవరీ చేసే వారికి కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఆయా ఫైనాన్స్ బ్రాంచ్ ల వారిగా రికవరీ ఏజెంట్లను, ఎజెన్సీలను కూడా ఏర్పాటు చేసుకుని సంస్థలు వాహనాలను సీజ్ చేయించేందుకు పురమాయిస్తున్నాయి. అయితే రికవరీ కోసం వెల్లే సీజింగ్ టీమ్స్ కూడా అప్పుడప్పుడు అత్యుత్సాహం చూపిస్తున్నాయని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నా వినియోగ దారుడు ఎప్పుడూ బలహీనుడే కాబట్టి ఫైనాన్స్ సంస్థలను ఏమీ చేయలేకపోతున్నారు. రికవరీ టీమ్స్ ను ఏర్పాటు చేసి వెహికిల్స్ సీజింగ్ చేయాలన్న నిభందనలు ఉన్నాయా లేవా అన్న విషయం అలా ఉంచితే మహారాష్ట్రలో సీజింగ్ టీమ్ వ్యవహరించిన తీరు మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని వైజాపూర్ లో ఫైనాన్స్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించకుండా తప్పించుకున్న తిరుగున్న బైక్ ను దొరకబట్టారు సీజర్స్. అయితే దానిని తీసుకెళ్లి సీజింగ్ యార్డులో అప్పచెప్తేనే డబ్బులు చేతికి వస్తాయని రికవరీ టీమ్ కాస్తా వెరైటీగా ఆలోచించేసింది. అక్కడి నుండి ఫైనాన్స్ కంపెనీ సీజింగ్ యార్డుకు తీసుకెళ్లాలని భావించి బైక్ కిక్ కొడితే స్టార్డ్ కావడం లేదు. దీంతో బైకును మరో బైక్ పై ఎక్కించుకుని సీజింగ్ యార్డుకు తరలించారు సీజింగి టీమ్. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో సీజింగ్ టీమా మజాకా అంటున్న వారూ లేకపోలేదు. అల్లంత దూరాన కనిపించిన బైక్ ను తీసుకెల్తేనే తమకు కంపెనీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇబ్బంది పడక తప్పలేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఓ బైక్ పై మరో బైక్ ఎక్కించుకుని మరీ సీజింగ్ టీమ్ టూవీల్లర్ ను తీసుకెళ్లడం మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/PeopleHyderabad/status/1636610823622631424?t=RlwGNKkTRjrYSYsEXeWTJQ&s=08
Disha Dasha
1884 posts
Prev Post