దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ రాంనగర్ మార్క్ ఫెడ్ గోదాముల ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంత్ ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు రంగంలోకి దిగి మంటలను ఆర్పారు. కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ ఏరియాలోని ప్లాస్టిక్స్ ఇండస్ట్రీలో కొద్ది సేపటి క్రితం షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుండి ఒక్కసారిగా పొగలు ఆకాశాన్ని తాకడంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక ఫైర్ వింగ్ అధికారులు ఇంజన్ తీసుకెళ్లి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఇండస్ట్రీలోని సామాగ్రి, మిషనరీ దగ్దం అయినట్టుగా తెలుస్తోంది. లేనట్టయితే ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఇండస్ట్రీ యజమాని అందుబాటులో లేకపోవడంతో నష్టం అంచనాపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఫైర్ ఇంజన్ దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగాఘటనా స్థలానికి చేరుకోవడంతో అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగిందని స్థానికులు చెప్తున్నారు.
