సాంతన సాఫల్యం కోసం సర్కారు సేవలు…

ప్రారంభం కానున్న తొలి కేంద్రం

దిశ దశ, హైదరాబాద్:

సంతానం కోసం అల్లాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రైవేటు కేంద్రాలు కెకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన కొన్ని కేంద్రాలు సంతానం కావాలని తల్లడిల్లుపోతున్న తల్లిదండ్రులను నిట్ట నిలువునా ముంచుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. లక్షల్లో బిల్లులు వేస్తుండడంతో సామాన్యులు ఐవీఎఫ్ కేంద్రాల వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. సంతాన సాఫల్యం కోసం ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలపై బాధితులు స్టేషన్లను ఆశ్రయించడంతో పాటు ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంతాన సాఫల్యం అనేది సగటు పౌరుల కుటుంబాలకు ఓ సవాల్ విసిరుతోంది. ఈ నేపథ్యంలో సంతానం లేని నిరుపేదలకు కూడా ఈ సేవలు అందించాలన్నలక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్ ను ప్రారంభించబోతోంది. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు గాంధీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టుగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో తొలి ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభింబోతున్న నేపథ్యంలో సంతానం లేని పేదలకు బాసటగా నిలిచే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సర్కారు కూడా తోడుగా నిలుస్తుండడం వల్ల వారసుల కోసం ఎదురు చూస్తున్న తమ వారి కలలు సాకారం కానున్నాయి.

You cannot copy content of this page