ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తున్న సెల్ ఫోన్ ఇండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో తెలుసా..? ఇండియన్స్ లో మొట్టమొదటి సారి ఫోన్ మాట్లాడింది ఎవరో తెలుసా… రెండు దశాబ్దాల క్రితం సెల్ ఫోన్ కూడా మన దేశంలో కాస్ట్లీ గానే ఉండేది. కానీ క్రమక్రమంగా సెల్ ఫోన్ ధరలు సామాన్యునికి అందుబాటులోకి వచ్చాయనే చెప్పాలి. 1990వ దశాబ్దంలో భారత్ లోకి సెల్ ఫోన్ అడుగుపెట్టే ముందు ‘పేజర్’లు వాడే వారు. అగ్గిపెట్టే సైజులో ఉండే పేజర్ కు కాలర్ ఫోన్ చేసి మెసేజ్ చేస్తే డిస్ ప్లే అయ్యేది. మెసెజ్ చూసుకున్న వ్యక్తి పేజర్ లో వచ్చిన నెంబర్ కు కాల్ చేయడమో లేక అతన్ని రిసీవ్ చేసుకునేందుకు వెల్లేవారు. ఆ తర్వాత అప్ డేట్ అయిన సెల్ ఫోన్ ప్రపంచ దేశాల్లోకి అడుగుపెట్టగా నెమ్మదిగా ఇండియాకు కూడా చేరింది. 1995లో ఉన్నత వర్గాలకు అందుబాటులోకి వచ్చిన సెల్ ఫోన్ ద్వారా మొట్టమొదట మాట్లాడింది మాత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు. కోల్ కత్తా నుండి అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్ రామ్ తో మాట్లాడారు. జులై 31న జ్యోతి బస్ ఫస్ట్ కాల్ చేసినప్పటికీ చాలా రాష్ట్రాల్లోకి మాత్రం 1997 తరువాత స్పీడ్ వచ్చి చేరిపోయింది. ESSAR, JTM మొబైల్ పేరిట మొదట సెల్ ఫోన్ వినియోగదారులు కమ్యూనికేషన్ సేవలు GSM ద్వారా అందించగా ఆ తరువాత వివధ కార్పోరేట్ కంపెనీలు, భారత సమాచార వ్యవస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సేవలు అందించడం ఆరంభించాయి. 1998లో 1.25 పైసల కాల్ చేసే విధానంతో టెలి కమ్యూనికేషన్ విభాగం లోకల్ కాల్స్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో నుండి కాల్ చేసి మాట్లాడితే సెల్ ఫోన్ వినియోగించే వారు లిఫ్ట్ చేస్తే రూ. రూ. 8 వరకూ సదరు కంపెనీలకు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఔట్ గోయింగ్ కాల్ చేస్తే రూ. 14 వరకు వినియోగదారుల నుండి కంపెనీలు వసూలు చేసేవి. ఆ తరువాత ఔట్ గోయింగ్ రూ. 7.50, ఇన్ కమింగ్ రూ. 3.75, ఇలా క్రమక్రమంగా తగ్గిపోతూ చివరకు ఇన్ కమింగ్ ఫ్రీ కాగా ఔట్ గోయింగ్ నిమిషానికి రూ. 2.50, రూ. 1.50, సెకన్ కు 2 పైసలు ఇలా తగ్గించుకుంటూ వచ్చిన సంస్థలు చివరకు ఇంత మొత్తంలో చెల్లించినట్టయితే ఏడాది పాటు ఇన్ కమింగ్ ఔట్ గోయింగ్ ఫ్రీ, రోజు వారి డాటా ఇంతా అని ఇస్తున్నాయి. అయితే పొరుగు రాష్ట్రాలకు అంటే ఎస్టీడీ కాల్ చేస్తే అదనంగా డబ్బులు వసూలు చేసే విధానం కూడా ఉండేది కాని ఇప్పుడు ఇండియా అంతా లోకల్ గానే పరిగణిస్తున్నాయి ఆయా కంపెనీలు. మొబైల్ కంపెనీలపై అజమాయిషీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాయిని కూడా ఏర్పాటు చేసింది. ఇండియాలోకి మొబైల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇన్ కమింగ్, అయినా ఔట్ గోయింగ్ అయినా నిమిషానికి రూ.8.45 ఉండగా ఆ తరువాత రూ.16.80 వరకూ పెరిగి ధర తగ్గిపోవడం ఆరంభించింది. ఇదీ సెల్ ఫోన్ కథా కమామిషూ…