దిశ దశ, జాతీయం:
ఓ ఐదేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు… పోలీసు అధికారి ముందున్న కూర్చిలో కూర్చున్నాడు… మా నాన్నపై కేసు పెట్టండి అని మొర పెట్టుకున్నాడు. ఐదేళ్ల పిల్లాడు తండ్రిపై కేసు పెట్టడం ఏంటీ..? ఆ తండ్రి అంత కిరాతకుడా అనుకోకండి… ఆ బుడ్డోడి స్వేచ్ఛను తండ్రి హరిస్తున్నాడని… ఫిర్యాదు చేశాడట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఐదేళ్ల బాలుడు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వీడియోను పోలీసులు రికార్డు చేశారు. నేరుగా ఠాణాలోకి ఎంట్రీ ఇచ్చిన బాలుడు పోలీసు అధికారి వద్దకు చేరుకుని తన పేరే అస్నేద్ అని తన తండ్రిపై కేసు నమోదు చేయాలని కోరాడు. ఎందుకని ఆ పోలీసు అధికారి అడగగా తాను నదిలోకి వెల్లకుండా, ఆడుకునేందుకు బయటకు వెళ్లకుండా నిలువరిస్తున్నాడని వివరించాడు. పోలీసులు తీసిన ఈ విడియోను సురేష్ సింగ్ ‘‘ఎక్స్ ట్విట్టర్’’ హైండిలో లో షేర్ చేయడంతో అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. ఐదేళ్ల పిల్లవాడు తన తండ్రిపై చేసిన ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయించాడంటే అతనికి కూడా వారిపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే బుడ్డోడు ఠాణాలోకి వచ్చి వెల్లిన వీడియో తీసిన పోలీసు సిబ్బంది కూడా నవ్వుతుండడం కొసమెరుపు.
https://x.com/sureshsinghj/status/1825726014531510703