మంత్రి కొప్పులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ…

నామాపూర్ వాసుల అసహనం

దిశ దశ, జగిత్యాల:

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సి వెలిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ లో వెలిసిన ఫ్లెక్సీలో ‘గో బ్యాక్ కొప్పుల ఈశ్వర్’ మెఘా కంపెనీ వల్ల ఎవరికి ఉపయోగం, కేసీఆర్ కుటుంబానికి, కొప్పుల ఈశ్వర్ కుటుంబానికి తప్ప అని రాయించారు. రెండు పంటలు పండే మెఘా కంపెనీని తీసుకొచ్చారు. కేసీఆర్ మరియు కేటీఆర్ ఏమి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెల్లినా భూమికి ఎకరానికి రూ. 30 లక్షలకు తక్కువ లేదని అన్నారు. కానీ మన నామాపూర్ గ్రామంలో రూ. 7 నుండి 8 లక్షలే ఇచ్చారు. ఇది మంత్రిగారి చేతకాని తనం కాదా, గత ఎన్నికల్లో మన గ్రామం నుండి మెజార్టీ ఇస్తే మన మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఇచ్చిన బహుమతి ఇది అంటూ రాసిన ఫ్లెక్సీ ప్రత్యక్ష్యం అయింది. గ్రామస్థులే ఏర్పాటు చేసినట్టుగా భావిస్తున్న ఈ ఫ్లెక్సీ ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్టుగా స్పష్టం అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫ్లెక్సీ వెలియడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page