దిశ దశ, జగిత్యాల, రాయికల్:
జగిత్యాల జిల్లాలోని పలువ మండలాల్లు జలదిగ్భందనంలో చిక్కుకపోయాయి. రహదారుల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఎక్కడిక్కక్కడ నిలిచిపోయాయి. జగిత్యాల పట్టణంలోని పలు కాలనీల్లో కూడా వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు భయాందోళణకు గరవుతున్నారు.
రాయికల్ చుట్టు ముట్టిన నీరు…
రాయికల్ మండలం మీదుగా ఇతర ప్రాంతాలకు ఉన్న దారులన్ని వరద నీటితో మూసుకపోయాయి. మండలంలోని సింగరావుపేట… జగిత్యాల రోడ్, రాయికల్… ఇటిక్యాల, రాయికల్… రామాజీపేట, భూపతిపూర్, భూపతిపూర్… మూటపెల్లి, రాయికల్ కోరుట్ల, రాయికల్ మెట్ పల్లి రహదారుల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో మండలంలోని 31 గ్రామాల ప్రజలు పొలిమేరలు దాటి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రామాజిపేట వైపు ఉన్న 26 గ్రామాలకు మండల కేంద్రానికి సంబంధాలు లేకుండా పోగా, జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలకు వెల్లే దారులన్ని మూసుకపోయాయి. దీంతో రాయికల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామలు జల దిగ్భందనంలో కూరుకపోయాయి.
జిల్లా అంతటా….
జగిత్యాల… ధర్మపురి ప్రధాన రహదారిలోని అనంతారం వాగు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ధర్మపురి నేరెళ్ల, పసుపల పాపన్న గుట్ట వద్ద జాతీయ రహదారి మీదుగా వరద నీరు ప్రవహిస్తుండగా, పొలాస గుల్లపేట వాగుపై నుండి వరద నీరు పారుతోంది. సారంగాపూర్ రహదారిపై కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ట్రాక్టర్లను అడ్డుగా పెట్టించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎస్సారెస్పీ నీరు కూడా వచ్చి చేరినట్టయితే జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి మండలాల్లోకి వరద నీరు మరింత వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉంది. అయితే గోదావరిలోకి వరద నీరు ఎక్కువగా వచ్చినట్టయితే సమీప మండలాల్లోని వాగులు వంకల మీదుగా ప్రవహిస్తున్న వరద నీరు ఒత్తిడికి గురై గ్రామాల్లోకి వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. జగిత్యాల పట్టణాన్ని కూడా వరద నీరు వదిలిపెట్టడం లేదు. పట్టణంలోని టవర్ సర్కిల్, పోచమ్మవాడ, మహాలక్ష్మీ నగర్, గంజ్ రోడ్, తులసీ నగర్, ధరూర్ క్యాంప్ లోని కొంత ప్రాంతంలో వర్షఫు నీరు వచ్చి చేరింది. మరో వైపున పట్టణాన్ని ఆనుకుని ఉన్న గోవిందుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెంకటాద్రి నగర్ జలదిగ్భందనంలో చిక్కుకపోయింది.