దిశ దశ, ఏపీ బ్యూరో:
మనిషి సహజంగా లభించే కూరగాయలతో జీవన విదానం ఎలా సాగించాలి అన్న అంశాలపై వివరించే ఆయన ఆశ్రమం నీట మునిగిపోయింది. కూరగాయల రసాలతో ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలని సూచించే ఆయన ఆశ్రమంలోకి వరద నీరు వచ్చి చేరడంతో పోలీసులు హుటాహుటిన అందులో ఉన్న వారిని ఖాలీ చేయించారు. ఆంద్రప్రదేశ్ లోని విజయవాడ, అమరవాతి మార్గమధ్యలో ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంటుంది. ప్రకృతిలో లభ్యమయ్యే వాటితోనే మనిషి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించవచ్చని టీవీల్లో ప్రసంగాలు చేసే ఆయన ఆశ్రమం మాత్రం కరకట్టపై నిర్మించడంతో వరద నీరు వచ్చి చేరిందని అంటున్నారు. నీటి వనరులకు సంబంధించిన బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ ఏరియాలో కానీ నిర్మాణాలు ఉండరాదు కానీ మంతెన సత్యనారాయణ ఆశ్రమం మాత్రం కరకట్టపై నిర్మించడంతో భారీ వరదల వల్ల నీరు చేరింది. దీంతో బోటు సహాయంతో అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/YSRCParty/status/1830510089435832603?t=m9qSjEWCjOd4tW5DXAeghA&s=09