దక్షిణాన కృష్ణా… ఉత్తరాన గోదావరి…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని జలశయాలన్ని జల కళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పొంగి పొర్లుతుండడంతో నదులపై నిర్మించిన ప్రాజెక్టుల  గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని నాగార్జున సాగర్ కు వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో దిగువ ప్రాంతాలకు వరద నీటిని వదిలారు. ఈ ప్రాజెక్టకు ఇన్ ఫ్లో 492387 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 540396 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదను అంచనా వేసిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. 80.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీలోకి 72.610 టీఎంసీల నీరు వచ్చి చేరింది. లక్షా 95 వేల 767 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లోగా వస్తుండగా, ఔట్ ఫ్లో 1,63,853 క్యూసెక్కులు వదిలారు. ఇందులో 5 వేల క్యూసెక్కుల నీటిని వరద కాలుక ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. దీంతో ఎల్ఎండీతో పాటు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఎల్ఎండీ నుండి కాకతీయ కెనాల్ ద్వారా నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page